Darbar Pre Release Event: నా కెరీర్‌లో దర్బార్ ఎంతో ఇంపార్టెంట్.. మురుగదాస్ కామెంట్స్

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.

దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్టాడుతూ.. 'ఎలా ఉన్నారు.. బాగున్నారా.. చాలా రోజులైంది.. ఇక్కడి వచ్చిన వారందరికీ నమస్కారం, రజినీకాంత్ సర్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు నమస్కారం. దర్బార్ సినిమా నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్..ఎందుకంటే సూపర్ స్టార్‌తో ఫస్ట్ సినిమా..అంతేకాకుండా మొదటి సారి ఓ కాప్ స్టోరీ చేశాను. బాగా వచ్చింది.

 Darbar Pre Release Event live: AR Murugadoss speech

మీరు కూడా చూసి చెప్పండి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు తీయాలంటే దానికి మంచి ప్రొడ్యూసర్లు కావాలి. సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. ఆయన స్వతహాగానే హీరో.. ఆయన జీవితంలో ఎన్నో మంచి సంఘటనలున్నాయి.. ఆయన బయోపిక్ తీయాలి.. ఈచిత్రంలో హీరోయిన్‌గా నయనతార బాగా చేశారు. ఆమెకు థ్యాంక్స్. నివేదా థామస్ ఓ మంచి పాత్రను పోషించారు.సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు మంచి పేరు వస్తుంది.

యోగి బాబు ఈ సినిమాలో కామెడీ బాగా చేశారు. రామ్ లక్ష్మణ్ మాష్టర్స్ ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే ఓ ఫైట్.. ఐదు నిమిషాల పాటు ఉండే ఆ సీక్వెన్స్ అదిరిపోతుంది. పదిహేనేళ్ల క్రితం రజినీని ఎలా ఉన్నారో ఈ చిత్రంలో అలానే ఉంటారు. అనిరుధ్ ఈ చిత్రానికి మంచి సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. రజినీ సర్‌కు అపోజిట్‌గా ఓ పవర్ ఫుల్ పాత్రలో సునీల్ శెట్టి బాగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ సంతానం, నా అసిస్టెంట్ డైరెక్టర్లందరికి థ్యాంక్స్' అంటూ ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X