Darbar Pre Release Event:సూపర్ స్టార్ కాదు.. గాడ్ ఆఫ్ సినిమా : సునీల్ శెట్టి కామెంట్స్
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించిన దలీప్ సాహెల్ మాట్టాడుతూ.. 'నేను తెలుగులో మాట్లాడలేను. రజినీకాంత్‌తో వర్క్ చేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఆయన కేవలం ఇండియాలోనే సూపర్ స్టార్ కాదు.. ప్రపంచలోనే సూపర్ స్టార్. నేను గత నలభై ఏళ్లలో ఆయన స్టైల్ చూస్తునే ఉన్నాను.. అలాంటి వారు ఇంకొకరు లేరు. మురుగదాస్, సంతోష్ శివన్, సునీల్ శెట్టి లాంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంద'ని మాట్లాడారు.

సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ మాట్టాడుతూ.. 'నేను దళపతి సినిమాకు రజినీకాంత్‌తో వర్క్ చేశాను.. అయితే ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. మురుగదాస్ ఎప్పటి నుంచో నాకు కథలు చెబుతున్నారు. తుపాకీ సినిమా అప్పటి నుంచే రజినీ కోసం కథలు చెప్పేవారు. ఇప్పటికి సెట్ అయింద'ని అన్నారు.
సునీల్ శెట్టి మాట్టాడుతూ.. 'మీరు రజినీకాంత్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో.. నేను కూడా అంతే ప్రేమిస్తున్నాను. దర్బార్ టీమ్ మంచి టీమ్.. మురుగదాస్ బెస్ట్ గురు.. అందర్నీ బాగా గైడ్ చేశారు. సంతోష్ శివన్ లాంటి వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ లక్ష్మణ్ మాష్టర్లలో రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో ఇప్పటికీ తెలీదు.. ఆ ఇద్దరికీ థ్యాంక్స్..అనిరుధ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు లైకా వారికి, సుభాస్కరణ్‌కు ధన్యవాదాలు. రజినీ కేవలం సూపర్ స్టార్ కాదు.. గాడ్ ఆఫ్ సినిమా. ప్రతీ ఒక్కరిలో ఆయనకు సంబంధించినది ఏదో ఒకటి ఉంటుంది. నేను ఆయన్ను కలిసి ప్రతీ సారి ఏదో ఒకటి నేర్చుకున్నాన'ని తెలిపారు.


Click it and Unblock the Notifications











