'దర్బార్' అప్‌డేట్: తలైవా ఇన్ ఛార్జ్.. అంటూ దిగేసిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. జనవరి 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. 'దర్బార్' అప్‌డేట్స్ ద్వారా ఆసక్తి రేపుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా దర్బార్ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 'తలైవా ఇన్ ఛార్జ్.. 'అంటూ సాగిపోతున్న ఈ పాట రజినీ అభిమానులను ఆకట్టుకుంది. అనిరుధ్ అందించిన బాణీల్లో భాస్కర భట్ల తెలుగు పదాలను అమర్చాడు. రజనీ క్రేజ్‌ను, మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేశారు. పాట వింటుంటే కాస్త గందరగోళంగానే అనిపిస్తున్నప్పటికీ ఇందులో రజినీ స్టైల్ సూపర్‌గా ఉంది.

Darbar Update: Lyrical Song Out

ఈ దర్బార్ చిత్రంలో ముంబై పోలీస్ కమీషనర్ ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో రజినీకాంత్ నటించాడు. రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. టీజర్, ట్రైలర్‌లో సహజశైలితో ఆయన కేక పుట్టించాడు. దీంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2020 జనవరి 9వ తేదీన తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దర్బార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X