రజనీకాంత్‌కు రెండో ప్రత్యర్థి... దర్బార్‌లోకి ఎంట్రీ.. మరో విలన్ ఎవరంటే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా, నిర్విరామంగా జరుగుతున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఆర్ మురగదాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే ప్రతీక్ బబ్బర్ విలన్‌గా నటిస్తుండగా.. మరో విలన్‌గా మలయాళ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ఆ విలన్ ఎవరంటే..

ఇద్దరు విలన్లతో రజనీకాంత్
దర్శకుడు ఏఆర్ మురగదాస్ రూపొందించే చిత్రంలో ఒకరి కంటే ఎక్కువ విలన్లు ఉండటం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. తాజాగా దర్బార్ చిత్రంలో కూడా ఇద్దరు విలన్లకు చోటిచ్చారు. రజనీకాంత్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ప్రతీక్ బబ్బర్‌ను సిద్దం చేయగా.. మరొకరు చెంబన్ వినోద్ జోష్ విలన్‌గా రంగ ప్రవేశం చేశారు.

రెండో విలన్‌గా చెంబన్ వినోద్ జోష్
మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోష్ తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు. గోళిసోడా 2 చిత్రంతో తమిళంలోకి ప్రవేశించారు. ఆ చిత్రంలో థిళ్లై పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. తాజాగా దర్బార్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత తొందరగా రజనీకాంత్ సినిమాలో చోటు సంపాదించడం ఆయన ప్రతిభకు పట్టం కట్టారనే మాట వినిపించింది.

పొలిటికల్ థ్రిల్లర్‌గా దర్బార్
దర్బార్ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సామాజిక కార్యకర్తగా, పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారు. రజనీకాంత్‌కు ఈ చిత్రం తన కెరీర్‌లో 167వది కావడం విశేషం.

నయనతార, నివేదా థామస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా
దర్బార్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నది. విలక్షణ నటి నివేదా థామస్ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. ప్రకాశ్ రాజ్, యోగిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2020 సంవత్సరం సంక్రాంతికి విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











