చివరి క్షణం వరకు ఉత్కంఠ.. సస్పెన్స్, థ్రిల్లర్‌గా దర్పణం
ప్రతిభ ఉంటే చాలు పెద్ద హీరోనా? కొత్త తారలా? అనే ఆలోచన లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమానైనా కంటెంట్ బాగుంటే పెద్ద హిట్‌ను చేస్తున్నారు. అలాంటి కోవలోనే యువ తారలు తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'.. కొద్ది నెలల క్రితం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమయిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఇప్పటికే రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్‌కి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ వెంప మాట్లాడుతూ... క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం చాల బాగా వచ్చింది.. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా అనే సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. నటీనటులందరూ చాలా బాగా చేశారు. నిర్మాత సహకారం మర్చిపోలేనిది.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు.. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది.. అన్నారు.

నిర్మాత క్రాంతి కిరణ్ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాం.. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని
సెన్సార్ పనుల్లో ఉన్నాము.. వచ్చేనెలలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమా లను మించి ఈ సినిమా ఉంటుంది అని అన్నారు..

కెమెరామెన్: సతీష్‌ముత్యాల, ఎడిటర్: సత్య గిడుతూరి, మ్యూజిక్ డైరెక్టర్: సిద్దార్ధ్ సదాశివుని, ప్రొడ్యూసర్: క్రాంతి కిరణ్ వెల్లంకి, డైరెక్టర్: రామకృష్ణ. వెంప.


Click it and Unblock the Notifications











