twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి నిమిషం వరకు సస్పెన్స్‌తో దర్పణం.. రాజ్ కందుకూరి చేతుల మీదుగా..

    |

    త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ హీరో, హీరోయిన్లుగా రామకృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తాజాగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. నేను విడుదల చేసిన సాంగ్ చాలా బాగుంది. సిద్దార్థ్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు సినిమాను బాగా తెరకెక్కించారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

    Darpanam song released by Raj Kandukuri

    డైరెక్టర్ రామ‌కృష్ణ వెంప మాట్లాడుతూ... క్రైం, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్లలో రాబోతున్న ఈ చిత్రం అవుట్‌పుట్ బాగా వచ్చింది. లాస్ట్ మినిట్ వ‌ర‌కు ఏం జ‌రుగుతుందా అనే స‌స్పెన్స్ ఆద్యంతం అలరిస్తుంది. న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారి సహకారం మర్చిపోలేనిది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మించారు.. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది. జూలైలో విడుదల కాబోతుంది' అన్నారు.

    Darpanam song released by Raj Kandukuri

    నిర్మాత క్రాంతి కిర‌ణ్ వెల్లంకి మాట్లాడుతూ... మా చిత్రంలోని లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాం.. ఈ చిత్రానికి అందరూ సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాం. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుంది. ఈ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

    కెమెరామెన్: స‌తీష్‌ ముత్యాల‌
    ఎడిట‌ర్: స‌త్య‌ గిడుతూరి,
    మ్యూజిక్ డైరెక్ట‌ర్: సిద్దార్ధ్ స‌దాశివుని
    ప్రొడ్యూస‌ర్: క్రాంతి కిర‌ణ్ వెల్లంకి
    డైరెక్ట‌ర్ః రామ‌కృష్ణ‌. వెంప‌

    English summary
    Darpanam movie set release in July. This movie directed by Rama Krishna Vempa, Produced by Kiran Vallanki news. In this occassion, Producer Raj Kandukuri released a song from the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X