Dasara 2024: బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల హంగామా.. 6 సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే?

మన దేశంలో పండుగ వస్తుంది అంటే ఆరోజు పండుగతో పాటుగా థియేటర్స్ లోకి పెద్ద ఎత్తున సినిమాలు కూడా రిలీజ్ కి వస్తాయి. అలా ఈ ఏడాదిలో సంక్రాంతి నుంచి మొన్న వినాయక చవితి వరకు ఎన్నెన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాయి. మరి ఈ పండుగ మూమెంట్ లో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అవ్వడానికి లేదు అందులో కూడా ప్లాప్ లు ఉంటాయి.

కాగా ఈ వినాయక చవితి తర్వాత వచ్చిన పెద్ద పండుగే దసరా.. మరి ఈ దసరా కానుకగా మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సినిమాలు విడుదలకి వచ్చాయి. మరి ఈ ఐదింటిలో కూడా అన్నీ ఒకేలాంటి టాక్ ని తెచ్చుకున్నాయా లేదా ఏది దసరా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందో లుక్కేద్దాం..

dasara 2024 boxoffice out of 6 movies what are hits at telugu

మరి ఈ దసరా పండుగ సినిమాల్లో మొదటిగా సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టయన్' తో తన వేట స్టార్ట్ చేశారు. కాగా కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ దసరా మూమెంట్ ని మాత్రం తలైవా పట్టుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో నడుస్తుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల అయితే నెక్స్ట్ డే అక్టోబర్ 11 నే మొత్తం 4 సినిమాలు వచ్చేసాయి.

మరి వీటిలో సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో, గోపీచంద్ నటించిన విశ్వం రిలీజ్ కి వచ్చాయి. అలాగే వీటితో పాటుగా డబ్బింగ్ సినిమాలు ఆలియా భట్ నటించిన జిగ్ర, కన్నడ హీరో ధృవ్ షార్జా నటించిన మార్టిన్ లు వచ్చాయి. కాగా ఈ నాలుగింటిలో డబ్బింగ్ సినిమాలకి మాత్రం అనుకున్న రేంజ్ రెస్పాన్స్ లేదు. నిజానికి ఇవి చూసిన తెలుగు ఆడియెన్స్ డెడ్ అని చెప్పొచ్చు.

dasara 2024 boxoffice out of 6 movies what are hits at telugu

ఇవి దారుణంగా తేలిపోయాయి కానీ కంటెంట్ పరంగా మా నాన్న సూపర్ హీరో కి మంచి టాక్ పడింది. సో దీనికి కొంచెం ఛాన్స్ ఉంది. అలాగే విశ్వం విషయానికి వస్తే దీనికి మిగతా సినిమాలతో పోలిస్తే బెటర్ అనే టాక్ వినిపిస్తుంది. గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టుగా విశ్వం పరిస్థితి అని చెప్పాలి. సో ఆడియెన్స్ దీనికి కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఫైనల్ గా యువ హీరో సుహాస్ నటించిన చిత్రం "జనక అయితే గనక" దసరా రోజున రిలీజ్ కి వచ్చింది.

dasara 2024 boxoffice out of 6 movies what are hits at telugu

మరి ఈ సినిమాకి కూడా ప్రీమియర్స్ తో మంచి టాక్ పడింది. సో కంటెంట్ పరంగా మొత్తం 6 సినిమాల్లో రెండు మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కామెడీ పరంగా విశ్వం క్లిక్ అయ్యినా ఆశ్చర్యం లేదు. అలాగే రజినీ సినిమా కూడా ఓ మోస్తరు ఓకే అనిపించొచ్చు కానీ జిగ్ర, మార్టిన్ సినిమాలకి మాత్రం అస్సలు హిట్ అయ్యే ఛాన్సే లేదని చెప్పొచ్చు. సో ఈ 6 సినిమాల్లో మాత్రం మన తెలుగు సినిమాలదే పై చేయి అనేలా పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X