ఘోర రోడ్డు ప్రమాదంలో షైన్ టామ్ చాకో కారు .. స్పాట్‌లో తండ్రి మృతి.. దసరా విలన్ హాస్పిటల్ తరలింపు
మలయాళం నటుడు, నేచురల్ స్టార్ నాని బ్లాక్ బాస్టర్ మూవీ 'దసరా'లో విలన్ పాత్ర పోషించిన షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. కారులో తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తాజాగా కార్ యాక్సిడెంట్ జరగడంతో స్పాట్ లోనే తన తండ్రి చనిపోయాడు. ఈ మధ్యనే షైన్ టామ్ చాకోపై పోలీసు కేసులు నమోదవడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందిన క్రమంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. ఇక ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
కారు ప్రమాదంతో స్పాట్ డెట్..
కేరళకు చెందిన షైన్ టామ్ చావో త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు తన కారులో వెళ్తున్నారు. అది కూడా తన తండ్రి సీపీ చావోకు హెల్త్ చెకప్ చేయించడం కోసమని బెంగళూరుకు వెళ్తున్నారు. కారులో షైన్ టామ్ చావో, ఆయన తండ్రి, మృతుడు సీపీ చావో, డ్రైవర్ కూడా ఉన్నారు. అయితే కారును డ్రైవర్ నడుపుతున్నాడు. ఆయనకు 42 ఏళ్లు ఉన్నాయి. కారు ప్రమాదంలో నటుడిగా తండ్రి సీపీ చావో మరణించగా.. షైన్ టామ్ చావోకు తీవ్రంగా గాయలయ్యాయి. అలాగే డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించినట్టు మాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

యాక్సిడెంట్ ఎక్కడ, ఎలా జరిగింది..
కేరళలోని త్రిస్సూర్ నుంచి తన తండ్రికి హెల్త్ చెకప్ కోసమని షైన్ టామ్ చావో ఈ రోజు ఉదయం బెంగాళూరుకు బయల్దేరారు. కారులో ప్రయాణిస్తుండగా ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ దగ్గర్లోని పరైయూర్ వద్ద కారు అదుపు తప్పింది. ముందున్న ట్రక్ కు ఢీకొట్టింది. దీంతో అతని తండ్రి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. షైన్ టామ్ చాకోకు తీవ్రంగా గాయాలు తగిలాయి. అలాగే కారులో నటుడి సోదరుడు జో జాన్ చాకో, అతని మేనేజర్ అనిస్ కూడా ఉన్నారు. వాళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ధర్మపురి ఆస్పత్రిలో చికిత్స..
ప్రమాదం గురించి తెలుసుకున్న పాలకోడ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ షైన్ టామ్ చాకోను, అతని బ్రదర్, మేనేజర్ ను ధర్మపురిలోని ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోకి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సీపీ చాక్ మృత దేహాన్ని ధర్మపురిలోని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. ఇక కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారును కూడా స్వాధీనంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు. ప్రస్తుతం షైన్ టామ్ చాకో ఆరోగ్య పరిస్థితి కూడా విషయంగా ఉందని తెలుస్తోంది.
షైన్ టామ్ చాకో తెలుగు సినిమాలు..
నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన 'దసరా' చిత్రంలో విలన్ పాత్రలో అలరించారు. అలాగే దేవర, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. చివరిగా తమిళ స్టార్ అజిత్ కుమార్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ లో నటించారు. ఇక ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో 2011 నుంచి యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం మలయాళంలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు షైన్ టామ్ పై ఆ మధ్య డ్రగ్స్ కేసు నమోదై పెద్ద రచ్చగా మారింది. ఆ వెంటనే మలయాళ నటి కూడా కేసు పెట్టడంతోనూ ఆయన పేరు బాగానే వినిపించింది. ఇక ఇప్పుడు ఇలా రోడ్డు ప్రమాదానికి గురి కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











