Dasara Teaser Review గంపగుత్తగా లేపేద్దాం.. బాంచోత్ అంటూ నాని.. రాజమౌళి ఎమోషనల్ కామెంట్

కంటెంట్ ప్రధానంగా వస్తున్న సినిమాలకు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్నది. భాష ఏదైనా మంచి సినిమా అయితే ప్రేక్షకులు ప్రాంతీయ, సరిహద్దులు లేకుండా పట్టం కడుతున్నారు. ఇటీవల వచ్చిన కంతార, కార్తీకేయ2, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం రిచ్ కంటెంట్, తెలంగాణలోని కోల్ బెల్ట్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న చిత్రం దసరా.

నేచురల్ స్టార్ నానీ, కీర్తీ సురేష్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ను దేశవ్యాప్తంగా అట్టహాసంగా ఆవిష్కరించారు. ఈ టీజర్ ఆవిష్కరణ, టీజర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

రాజమౌళి, ధనుష్, షాహిద్ కపూర్

రాజమౌళి, ధనుష్, షాహిద్ కపూర్

దసరా సినిమా టీజర్‌ను పలు భాషల్లో సినీ ప్రముఖులు ఆవిష్కరించారు. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి, హిందీలో షాహిద్ కపూర్, తమిళంలో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. దసరా సినిమా టీజర్ ముతకగా, పక్కా నేటివిటితో ఇంటెన్సివ్‌గా కనిపించింది. చెడుపై మంచి సాధించే విజయం దసరా పండుగకు సూచిక. ఈ సినిమా టీజర్ కూడా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది

 రాజమౌళి ప్రశంసలు

రాజమౌళి ప్రశంసలు

నాని నటించిన దసరా సినిమా టీజర్‌ను ఆవిష్కరించిన రాజమౌళి ట్వీట్ చేస్తూ.. దసరా సినిమా టీజర్‌లో విజువల్స్ చాలా బాగున్నాయి. నాని మాస్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది. తొలి చిత్ర దర్శకుడు ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ చేయడం వెరీ గుడ్ అనిపించింది. టీజర్‌లో చివరి సీన్ తోపు. దర్శకుడు ఓదెల శ్రీకాంత్, యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ అని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

గోదావరి ఖని ప్రాంతంలోని వీర్లపల్లి

గోదావరి ఖని ప్రాంతంలోని వీర్లపల్లి

కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలోని పగ, ప్రతీకారాలు, వివక్ష నేపథ్యంగా దసరా పండుగ సాగుతుంది. ఒపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో మసి నుంచి పుట్టిన యువ కెరటం.. ఆ ప్రాంతంలోని వివక్షపై తిరుగబాటు చేసినట్టు టీజర్ స్పష్టం చేసింది. నూతన దర్శకుడు నాని కోసం రూపొందించిన కథ, విజువల్స్, యాక్షన్ సీన్లు వెండితెరపై కేక పెట్టించాయి. సినిమాపై భారీ అంచనాలు లేపాయి.

మందంటే మాకు వ్యసనం కాదు..

మందంటే మాకు వ్యసనం కాదు..

దసరా టీజర్ విషయానికి వస్తే.. నాని వాయిస్‌తో కామెంటరీ చెబుతూ.. వీర్ల పల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి చూస్తేగానీ.. కనిపించని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సంప్రదాయం అంటూ నాని.. మద్యం సేవించే తీరు యమా మాస్‌గా ఉంది. ఆ ఊరిలో రావణసురులను ఎదురించే ధైర్యాన్ని కూడగట్టుకొన్న యువకుడిగా నాని.. టీజర్‌లో భారీగా ఎమోషన్స్ నింపాయి.

పోయి పడుకో అంటూ సాయికుమార్ అంటే.. ఏదైతే.. అది.. గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచోత్ అని నాని అనడం ప్రతీకారానికి పరాకాష్టగా కనిపించింది. చివర్లో నోట్లో కత్తి పెట్టుకొని.. వేలిని కత్తికి రాసి.. నెత్తుటి బొట్టు పెట్టుకోవడం కొసమెరుపుగా కనిపిస్తుంది.

నాని కెరీర్ మలుపుతిప్పే కథతో

నాని కెరీర్ మలుపుతిప్పే కథతో

దసరా టీజర్ చూసిన తర్వాత నాని ఫెర్ఫార్మెన్స్ మరోస్థాయిలో ఉంటుందనే ఫీలింగ్ గ్యారెంటీ ఇచ్చింది. ఇప్పటి వరకు క్లాస్, పక్కింటి కుర్రాడిగా కనిపించిన నాని.. తన కెరీర్ మలుపు తిప్పే పాత్రలో నటించారనే టీజర్ స్పష్టం చేసింది. మాస్ లుక్, మట్టిలోనే కాకుండా వివక్షలో నలిగిపోయిన తెలంగాణ యువకుడిగా భావోద్వేగమైన పాత్రలో నటించారనేది స్పష్టమైంది.

మార్చి 30న దసరా పండుగ

మార్చి 30న దసరా పండుగ

దసరా చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. పక్కా నాటు, గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంపై టీజర్ అంచనాలు పెంచింది. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి క్రేజ్ వచ్చింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ద్వారా మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

దసరాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: నాని, కీర్తీ సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహెబ్ తదితరులు
దర్శకత్వం: శ్రీకాంత్ ఒదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్ ఐఎస్సీ
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
ఎడిటర్: నవీన్ నూలీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కోళ్ల
ఫైట్స్: రియల్ సతీష్, అంబరివ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి
రిలీజ్ డేట్: 2023-01-30

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X