అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ లుక్‌కి ముహూర్తం ఖరారు!
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. రవితేజకు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం విజయం సాధించడం అటు రవితేజకు, ఇటు శ్రీనువైట్లకు చాలా అవసరం.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఖరారైంది. రేపు( ఆగష్టు 27) సాయంత్రం 6:30 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. చాలా కాలం తరువాత నడుము సిందరి ఇలియానా నటిస్తున్న తెలుగు చిత్రం ఇది.

మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇలియానా 2012 లో వచ్చిన రవితేజ చిత్రం దేవుడు చేసిన మనుషులు లో నటించింది. ఇలియానా చివరగా తెలుగులో నటించిన చిత్రం ఇదే. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ అమర్ అక్బర్ ఆంటోని తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.


Click it and Unblock the Notifications











