twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంగవీటి రంగాను మళ్లీ చూసినట్లుంది.. సురేష్ కొండేటి గెటప్ గురించి దర్శకుడు ధవళ సత్యం

    |

    దేవినేని బయోపిక్‌లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గెటప్‌లో ప్రముఖ పాత్రికేయుడు, నిర్మాత సురేష్ కొండేటి స్టిల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగా జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన గెటప్‌కు సంబంధించిన ఆయన ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం స్పందించారు. గతంలో వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా చైతన్య రథం సినిమాను ఆయన తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా దేవినేని బయోపిక్ వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అప్పట్లో రంగా ఎలా ఉండేవారో.. ఇప్పుడు సురేష్ కూడా అలానే ఉన్నారు. ఆయన గెటప్ చూసి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను అని ధవళ సత్యం పేర్కొన్నారు.

    రంగా గారు బతికి ఉన్న సమయంలో ఆయన గురించి చాలా రకాలుగా అనుకొనేవారు. ఆయనంటే జనానికి ఓ భయం, భక్తి ఉండేది. అలాంటి వ్యక్తిని ఓసారి దాసరి గారి ఇంటిలో అనుకోకుండా చూశాను. గురువుగారు ఫోన్‌ చేసి రమ్మంటే వెళ్ళాను. ఎదురుగా చిన్నకుర్రాడులా ఓ వ్యక్తి వున్నాడు. ఎవరో అని అనుకున్నా. గురువుగారు నన్ను ఆయనకు పరిచయం చేశారు. తను నా గురించి తెలుసన్నారు. నాకు ఆయన తెలియదని చెబితే.. వెంటనే గురువుగారు.. వంగవీటి మోహన రంగా గారురా! మన రంగా! అంటూ పరిచయం చేశారు. నేను కాసేపు అలానే చూస్తుండిపోయా. ఆ తర్వాత ఆయన అసలు విషయం చెప్పారు. రంగాగారిపై సినిమా చేయాలన్నారు. అప్పటికే తను ఎం.ఎల్‌.ఎ.గా వున్నారు అని ధవళ సత్యం తెలిపారు.

    Davala Satyam: I seen Vangaveeti Ranga in Suresh Kondeti

    నేనూ ఆ సమయంలో కమ్యూనిస్టుపార్టీలో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నా. పలు సభల్లో రంగా గురించి విమర్శించాను కూడా. అందుకే నాకు ఆ చిత్రం ఇబ్బంది కలుగుతుందని చెప్పి.. పార్టీ పర్మిషన్‌ తీసుకుని చేస్తానని దాట వేశాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సినిమా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు కథ చెప్పాడు. అది నచ్చలేదని చెప్పేశా. నాకు తెలిసిన రంగా కథ ఇదికాదు.. అంటూ.. మీతో కొంతకాలం ట్రావెల్‌ అయ్యాక మీ గురించి తెలిసాక పూర్తి కథ నేనే రాస్తానని చెప్పడంతో.. నా ధైర్యం నచ్చి నీలాంటి దర్శకుడే కావాలని రంగా మెచ్చుకున్నారు. అలా 'చైతన్యరథం' తెరపైకి వచ్చింది అని చెప్పారు.

    అందరి అభిప్రాయాలకు విరుద్దంగా రంగా ఉండేవారు. నాకు తెలిసిన రంగా చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు.. 'ఏంటమ్మా.. ఏంటీ విషయాలు. వేషాలు ఎక్కువయ్యాయంటగదా.. కాలు చెయ్యి తీసేద్దామా.. ఎందుకంటే నువ్వు బతకాలికదా.. భార్య పిల్లలు చక్కగా చూసుకోవాలికదా.. ఏంటి చెప్పు ఇది కరెక్టేనా! అంటూ.. చాలా సౌమ్యంగా చెబుతూ కళ్ళతోనే ఎదుటివారికి భయాన్ని కలిగించే వారు అని ధవళ సత్యం వెల్లడించారు.

    Davala Satyam: I seen Vangaveeti Ranga in Suresh Kondeti

    ఆయనతోపాటు చాలారోజులు కారులో తిరిగాను. ఆయన హావభావాలు, అక్కడి సంఘటనలు రాసుకునేవాడిని. అన్ని ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినవాడు. అందరూ తనవారే అనుకునేవారు. ఇప్పుడు.. కొండేటి సురేష్ స్టిల్‌ను చూస్తుంటే.. అచ్చం అప్పటి రంగానే చూసినట్లుంది. సురేష్‌ మాట తీరు కూడా అచ్చు అలానే వుంటుంది. ఆయన నేత్రాలు కూడా అలానే వున్నాయి. ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. అందుకే సురేష్‌ను ప్రత్యేకంగా అభినందించకుండా వుండలేకపోతున్నా. ఈ సినిమా ద్వారా సురేష్‌కు మంచి పాత్రలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ధవళ సత్యం అన్నారు.

    English summary
    Vijayawada based politician Devineni Nehru life story getting ready as Devineni Biopic title as Devineni. Bezawada Simham is the tag line. Siva Nagu is the director. On late Vangaveeti Ranga birthday, Unit released Suresh Kondeti still from movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X