‘రాబిన్ హుడ్’ లో డేవిడ్ వార్నర్.. 4 రోజుల షూట్ కు అన్ని కోట్లా రెమ్యునరేషనా?

టాలీవుడ్ స్టార్ నితిన్ త్వరలో రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవీన్ ఎర్నేని, ఎలమంచి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించారు. నితిన్ హీరోగా నటించగా, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఫిమేల్ లీడ్ లో నటించింది.

ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను కూడా అందిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటివరకు మూడు సాంగ్స్ కూడా విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. కేతిక శర్మ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టబోతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, చంద్ర ప్రసాద్, దేవ దత్త వంటి ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషించారు.

David Warner 4 Days Remuneration for Nithin Robinhood Movie

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హైలెట్ గా స్టార్ క్రికెటర్ పాత్రను డిజైన్ చేయడం విశేషం. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ద్వారా కోట్లాదిమంది అభిమానులను సాధించుకున్న డేవిడ్ వార్నర్... ఇక ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ పైన కూడా స్పందిస్తూ ఉంటారు. గతంలో వచ్చిన పుష్ప చిత్రానికి సంబంధించిన పుష్ప రాజ్ మేనరిజాన్ని అనుసరించి చిత్ర పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారారు. టాలీవుడ్ లో వచ్చే బిగ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్, పాపులర్ డైలాగ్ లను రీల్స్ చేస్తూ అలరించేవాడు.

అలా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లోనూ డేవిడ్ వార్నర్ తన ఆసక్తిని కనబరిచారు. దీంతో డైరెక్టర్ వెంకీ కుడుముల ఏకంగా ఆయన కోసం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబిన్ హుడ్ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేశారు. ఇక డేవిడ్ వార్నర్ ఈ చిత్రంతో మొట్టమొదటిసారిగా వెండితెరపై అలరించబోతున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ కు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. దీంతో ఇటు సినీ ప్రియులు, క్రికెట్ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. డేవిడ్ వార్నర్ ను వెండితెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నారు.

అయితే డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టబోతున్నారని తెలుస్తోంది. అందుకు ఈ చిత్రానికి నాలుగు రోజులపాటు డేట్ ఇచ్చారంట. అయితే ఇప్పుడు కేవలం నాలుగు రోజులు షూటింగ్కు హాజరైనందున డేవిడ్ వార్నర్ కోట్లల్లో పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. 4 రోజులకు గాను ఏకంగా 2.25 కోట్ల రెమ్యూనరేషన్ ను మైత్రి మూవీ మేకర్స్ నుంచి అందుకున్నారంట. దీంతో డేవిడ్ వార్నర్ రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇక ఆయన పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అనేది సర్వత్ర ఆసక్తిని నెలకొల్పింది.

More from Filmibeat

Read more about: robinhood nithiin david warner
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X