ఎన్టీఆర్ కోసం డేవిడ్ వార్నర్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పక్కా లోకల్ వీడియో వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ వారి అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఈసారి ఐపిఎల్ లేదు అనే బాధను మరిచిపోయేలా లోకల్ తెలుగు ఆడియెన్స్ ని తన టిక్ టాక్ వీడియోస్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. బుట్ట బొమ్మ అంటూ మొదలు పెట్టి మొన్న మహేష్, ప్రభాస్ బెస్ట్ డైలాగ్స్ తో మెప్పించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు డేవిడ్ వార్నర్ నందమూరి అభిమానులను కూడా ఎట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్నర్ తన భార్యతో కలిసి జనతా గ్యారేజ్ ఐటెమ్ సాంగ్ స్టెప్పులు వేశాడు. నేను పక్కా లోకల్ అంటూ భార్యతో కలిసి నెటీజన్స్ కి మంచి కిక్కిచ్చాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పిన ఈ క్రికెటర్ మేము ఈ డ్యాన్స్ కోసం చాలా ప్రయత్నం చేశామని చెబుతూ.. ఈ డ్యాన్స్ చాలా వేగంగా ఉందని అన్నారు.

David Warner birthday wishes to jr ntr with special song

చూస్తుంటే డేవిడ్ వార్నర్ తెలుగు ఆడియెన్స్ మనసులో ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించే వార్నర్ ఈ సారి తెలుగు హీరోల సాంగ్స్ తో అద్భుతంగా ఆకట్టుకోవడం బావుంది. ముందుముందు ఇతర హీరోల అభిమానుల డ్యాన్సులు, డైలాగ్స్ తో కూడా ఆకట్టుకునే ఛాన్స్ ఉందట. భవిష్యత్తులో వార్నర్ తెలుగుతెరపై ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేని అంటున్నారు కొంతమంది నెటీజన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X