డేవిడ్ వార్నర్ ఈజ్ బ్యాక్.. ఈ సారి సాయి పల్లవితో రచ్చ..ఎక్కడా తగ్గట్లేదు!
వీలు దొరికితే చాలు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత సినిమా రంగం మీద తన ప్రేమను చాటుకుంటూ ఉంటారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో అల వైకుంఠపురం సినిమాలో పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసి ఆయన తెలుగు వాళ్ళ నోళ్ళలో బాగా నానాడు. ఆ తరువాత తన భార్యతో కలిసి బుట్ట బొమ్మ పాటకు ఆయన వేసిన స్టెప్స్ అప్పట్లో అయితే చాలా వైరల్ అయ్యాయి కూడా.
ఇక ఆ తర్వాత రాములో రాముల పాటకు కూడా ఆయన స్టెప్పులు వేశాడు. ఇలా ఒకటని కాదు మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరిలో డైలాగులు చెప్పాడు, బాహుబలి గెటప్ లో మెరిశాడు. అయితే ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ రావడంతో కాస్త ఈ వ్యవహారాలకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో తెలుగు ఫ్రాంచైజీ 'సన్‌రైజర్స్ హైదరాబాద్' కు వార్నర్ కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఐపీఎల్ సీజన్ లో ఈ టీం అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేకపోయింది. అయితే అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా ఐపీఎల్ అప్పటికప్పుడు నిలిపి వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ కాస్త సమయం చిక్కడంతో మళ్లీ ఇప్పుడు ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా పాపులర్ డిమాండ్తో మళ్లీ బ్యాక్ అయ్యానంటూ మారి 2 సినిమా లో ధనుష్ సాయి పల్లవి కలిసి రౌడీ బేబీ పాటకు వేసిన స్టెప్పులు వేస్తునట్టుగా ఫేస్ యాప్ ద్వారా ఫేస్ మార్చుకుని మరీ ఎంట్రీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్. అంతేకాక దానికి పేరు పెట్టాలని కూడా ఆయన కోరాడు. ఇక గతంలో వార్నర్ వీడియోపై తెలుగు సినీ ప్రముఖులు సైతం స్పందించారు. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్... వార్నర్ పోస్టులకు రిప్లై కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన వీడియోకి ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











