మహేష్ బాబు లుక్కుతో మరోసారి సారి షాక్ ఇచ్చిన వార్నర్.. నెవర్ బిఫోర్ అనేలా..
మన దేశం క్రికెటర్ కాకపోయినా కూడా డేవిడ్ వార్నర్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అతన్ని ఒక స్టార్ హీరో రేంజ్ లో లైక్ చేస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ మొదటి నుంచి కూడా తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా వీడియోలను వదులుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటివల ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మరొక సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ఈ ఏడాదిని ఒక కష్టమైన దానితో పూర్తి చేద్దాం అంటూ న్యూ ఇయర్ 2021అని విష్ చేసిన డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో చాలా వైరల్ అవుతోంది. నెవర్ బిఫోర్ అనేలా మహేష్ బాబు లుక్కుతో కొత్త షాక్ ఇచ్చాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎలాగైతే కనిపించాడో అలానే తన ఫేస్ ను ఎడిట్ చేసి వీడియోను విడుదల చేశాడు. గతంలోనే డేవిడ్ వార్నర్ విభిన్న రకాలుగా మహేష్ స్టైల్ ను ఫాలో అయ్యాడు.

కానీ మహర్షి లుక్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. స్మైల్, యాక్షన్, డైలాగ్స్ చెప్పడం ఇలా అన్ని విషయాల్లో డేవిడ్ మహర్షి అదిరిపోయాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వార్నర్ కిర్రాక్ అనే ట్యాగ్స్ అయితే ఎక్కువగా అందుతున్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో ఈ స్టార్ క్రికెటర్ హీరో అయినా అయిపోవచ్చని అంటున్నారు. బాహుబలి డైలాగ్ తో పాటు బుట్టబొమ్మ డ్యాన్స్ తో కూడా వార్నర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం మహర్షి లుక్ కూడా వైరల్ అవుతోంది. మరి న్యూ ఇయర్ రోజు మరొక సర్ ప్రైజ్ ఏదైనా ఇస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











