ఇది అరాచకం.. రాములో రాములా పాటతో సరికొత్త కిక్కిచ్చిన వార్నర్!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ తో ఈ లాక్ డౌన్ ని బాగానే ఎంజాయ్ చేశాడు. ఐపీఎల్ లేకపోవడంతో తెలుగు ఆభిమానులను ఏ మాత్రం బోర్ కొట్టించకుండా టిక్ టాక్ గ్రౌండ్ లో ఇన్ని రోజులు మంచి ఎంటర్టైన్మెంట్ బ్యాటింగ్ ఆడేశాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఏ హీరోలను వదలకుండా ఇమిటేట్ చేసి అన్ని వర్గాల ఆడియెన్స్ ని తన టిక్ టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు.
గ్యాప్ లేకుండా రోజు ఎదో ఒక వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ఈ స్టార్ క్రికెటర్ ఇన్నాళ్లు చేసిన ప్రతి ఒక్క వీడియోను కలిపి మరో అదిరిపోయే వీడియోను క్రియేట్ చేశాడు. రాములో రాములో సాంగ్ లో తన వీడియోలను కరెక్ట్ సింక్ అయ్యేలా సెట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్నర్ ఈ రేంజ్ లో ఇరగదిస్తాడు అని ఎవరు ఊహించలేదు.

పైగా తన ఫ్యామిలీని కూడా తన వీడియోలలో చూపించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కూతుళ్లు అయితే నాన్నతో సమానంగా హడావుడి చేశారు. తెలుగు ఆడియెన్స్ ఐపీఎల్ ని మిస్సయిన మూడ్ లో ఉన్నప్పటికీ వార్నర్ తనవంతు కృషిగా టిక్ టాక్ తో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియోలు అన్ని కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











