రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. టాప్ క్రికెటర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న చిత్రం రాబిన్‌హుడ్. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో యువ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే విషయం లీక్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారతీయ క్రికెట్, సినీ అభిమానులకు డేవిడ్ వార్నర్ అంత్యంత సుపరిచితులు. క్రికెట్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకొన్న ఈ డేరింగ్ బ్యాట్స్‌మెన్ ఇటీవల కాలంలో తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ రీల్స్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్‌గా మారారు. అయితే అప్పట్లోనే సినిమాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే లేట్ అయినా లేటేస్టుగా రాబిన్ హుడ్ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అయితే డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా రంగ ప్రవేశం చాలా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. నిర్మాతలు, దర్శకుడు ఈ విషయాన్ని బయటకు రాకుండా చూసుకొన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కింగ్స్టన్ ఈవెంట్‌లో నిర్మాత రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్ నటిస్తున్న విషయాన్ని బయటపెట్టి లీక్ చేశారు. దాంతో ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
రాబిన్‌హుడ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే విషయంపై వార్నర్‌ను ఒప్పించడానికి దర్శక, నిర్మాతలు గట్టిగానే ప్రయత్నించారు. ఈ సినిమాలో క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్ ఉండటం, అలాగే భారీగా పారితోషికం అందించడానికి బ్యానర్ రెడీ కావడంతో ముందు వెనుకా ఆలోచించకుండా తెలుగు సినీ రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైనట్టు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా, డేవిడ్ వార్నర్‌కు మంచి ప్యాకేజ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ఆయన రెమ్యురేషన్ గురించి ట్రేడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. సుమారుగా 50 లక్షల రూపాయలను పారితోషికంగా అందించినట్టు తెలుస్తున్నది. ఈ మొత్తం చెల్లించినట్టయితే వార్నర్ లక్కీగా బూరెల బుట్టలో పడినట్టే అని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే.. హానీ సింగ్ అనే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనవంతుల వద్ద దోపిడి చేసి పేదలకు పంచే రాబిన్ హుడ్ క్యారెక్టర్. ఈ సినిమా వినోదప్రధానంగా, ఎమోషనల్ కంటెంట్‌తో రానున్నది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











