వెంకటేష్ హీరోగా మరో రీమేక్ ఖరారైంది, అఫీషియల్‌గా ప్రకటించిన సురేష్ బాబు!
విక్టరీ వెంకటేష్ త్వరలో రీమేక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల హిందీలో విడుదలై మంచి విజయం అందుకున్న అజయ్ దేవగన్ ఫిల్మ్ 'దేదే ప్యార్ దే' తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సురేష్ బాబు అఫీషియల్‌గా ప్రకటించారు.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సురేష్ బాబు తమ బేనర్ నుంచి రాబోతున్న ప్రాజెక్టులను ప్రకటించారు. ప్రస్తుతం 'వెంకీ మామ' చిత్రం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలిపారు.
రానా దగ్గుబాటి హీరోగా 'హిరణ్యకశిప' చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, ఇండియాలోనే బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటిగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చారిత్రక చిత్రం మరో మూడేళ్లలో ప్రేక్షకులకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

మా సంస్థ నుంచి ఇకపై మరిన్ని ఎక్కువ చిత్రాలు నిర్మించాలని డిసైడ్ అయ్యాం, ఇటీవలే 'దేదే ప్యార్ దే' హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాం. వెంకటేష్ హీరోగా దీన్ని తెరకెక్కించే ఆలోచన ఉంది. తరుణ్ భాస్కర్, త్రినాథరావు దర్శకత్వంలో కూడా వెంకటేష్ సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సురేష్ బాబు తెలిపారు.
కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నట్లు సురేష్ బాబు తెలిపారు. మా సంస్థ 55 సంవత్సరాలగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ వల్లే సాధ్యమైందని తెలిపారు. 'ఓ బేబీ' చిత్రం జులై 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











