Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ఆంథెమ్
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ అండ్ టీమ్ సౌతిండియాలోని ఐదు రాష్ట్రాలు తిరుగుతూ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా డియర్ కామ్రేడ్ ఆంథెమ్ విడుదల చేశారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న లిరిక్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అర్థవంతంగా ఉండటమే కాదు... యువతలో చైతన్యం తెచ్చేలా ఉన్నాయి. అందుకు తగిన విధంగా జస్టిన్ ప్రభాకరన్ టెర్రిఫిక్ మ్యూజిక్ కంపోజింగ్ సూపర్బ్ అనేలా ఉంది. ఈ పాటను తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా విడుదల చేశారు.
ఇందులో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నారు. తెలుగులో ఈ పాటను విజయ్ దేవరకొండ పాడగా... మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పాడారు. డిసెంబర్ 26న ఈ మూవీ ఏ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేయబోతోందో చూడాలి.