twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ఆంథెమ్

    |

    విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

    విజయ్ దేవరకొండ అండ్ టీమ్ సౌతిండియాలోని ఐదు రాష్ట్రాలు తిరుగుతూ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా డియర్ కామ్రేడ్ ఆంథెమ్ విడుదల చేశారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న లిరిక్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

    Dear Comrade: Comrade Anthem Lyrical Song released

    చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్‌ అర్థవంతంగా ఉండటమే కాదు... యువతలో చైతన్యం తెచ్చేలా ఉన్నాయి. అందుకు తగిన విధంగా జస్టిన్ ప్రభాకరన్ టెర్రిఫిక్ మ్యూజిక్ కంపోజింగ్ సూపర్బ్ అనేలా ఉంది. ఈ పాటను తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా విడుదల చేశారు.

    ఇందులో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నారు. తెలుగులో ఈ పాటను విజయ్ దేవరకొండ పాడగా... మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పాడారు. డిసెంబర్ 26న ఈ మూవీ ఏ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేయబోతోందో చూడాలి.

    English summary
    Listen to Dear Comrade Telugu Movie Song, Comrade Anthem Lyrical Song Video. Sung by Vijay Deverakonda, Tony Psyko, Mc Vickey. DearComrade 2019 Latest Telugu Movie ft. Vijay Deverakonda and Rashmika Mandanna. Directed by Bharat Kamma. Music composed by Justin Prabhakaran. Produced by Naveen Yerneni, Y Ravi Shankar, Mohan Cherukuri (CVM) and Yash Rangineni under Mythri Movie Makers and Big Ben Cinemas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X