సూర్య ఎఫెక్ట్: విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ వాయిదా?
హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మార్చి 17న టీజర్ విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం రిలీజ్ గురించి ఓ రూమర్ తెరపైకి వచ్చింది. సూర్య నటించిన ఎన్.జి.కె చిత్రం మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో .... 'డియర్ కామ్రేడ్' మూవీని జూన్ 6వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.
తమిళ హీరో సూర్యకు... విజయ్ దేవరకొండ అత్యంత సన్నిహితుడు. ఆయనతో పోటీ పడుతూ అదే రోజు బాక్సాఫీసు బరిలో దూకడం ఇస్టం లేకనే ఈ నిర్ణయం తీసుకోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











