వెనక్కి తగ్గిన విజయ్ దేవరకొండ... ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్‌లో మార్పు!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ రిలీజ్ చేయడానికి గతంలో ప్లాన్ చేశారు. అయితే ఇదే రోజు సూర్య నటించిన ఎన్.జి.కె చిత్రం మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో .... 'డియర్ కామ్రేడ్' మూవీ రిలీజ్ డేట్ మార్చేశారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని జులై 26న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ న్యూ పోస్టర్ విడుదల చేసింది. తమిళ హీరో సూర్యకు... విజయ్ దేవరకొండ అత్యంత సన్నిహితుడు. ఆయనతో పోటీ పడుతూ అదే రోజు బాక్సాఫీసు బరిలో దూకడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకోతున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ కెరీర్లో ఒకేసారి 4 భాషల్లో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమా ద్వార సౌత్ మార్కెట్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్ దేవరకొండ. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జై కృష్ణ మాటలు రాశారు. రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











