రష్మికతో విజయ్ దేవరకొండ ఘాటైన ముద్దు: ‘డియర్ కామ్రేడ్’ టీజర్ సూపర్ హాట్
తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలు అందుకోవడంతో పాటు గీత గోవిందం సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ'. రష్మిక మందన్న హీరోయిన్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా అంచనాలు మరింత పెరిగాయి.

స్టూడెంట్ లీడర్ స్టోరీ?
కాలేజీలో విద్యార్థుల మధ్య జరిగే గొడవలతో టీజర్ మొదలైంది. దీన్ని బటి ఈ చిత్రం ఒక స్టూడెంట్ లీడర్ కథ అని తెలుస్తోంది. సామాజిక బాధ్యత ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పించనున్నట్లు స్పష్టమవుతోంది.

రష్మితో ఘాటైన ముద్దు సీన్
‘గీత గోవిందం' తర్వాత రష్మిక-విజయ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ‘డియర్ కామ్రేడ్'. అప్పట్లో గీత గోవిందం సినిమా రిలీజ్ ముందు రష్మిక-విజయ్ ముద్దే సీన్ లీక్ అవ్వడం సంచలనం అయింది. అయితే సిినమాలో మాత్రం ఆ సీన్ లేకుండా చేశారు. అయితే ‘డియక్ కామ్రెడ్'లో ఇద్దరి మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తాజాగా విడుదలైన టీజర్ బట్టి స్పష్టమవుతోంది.

రిలీజ్ ఎప్పుడంటే...
‘డియర్ కామ్రేడ్' చిత్రాన్ని మే 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగుతో పాటు ఇతర సౌతిండియా భాషల్లోనూ విస్తరించిన సంగతి తెలిసిందే.
డియర్ కామ్రేడ్
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని, సి.ఇ.ఒ: చెర్రీ, సంగీతం: జస్టిన్ ఫ్రభాకరన్, డైలాగ్స్: జె కృష్ణ, ఆర్ట్: రామాంజనేయులు, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.వి.ఎస్.సుబ్రమణ్యం, సాహిత్యం: చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్, కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్, యాక్షన్ డైరెక్టర్: జి.మురళి, పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్, భాను.


Click it and Unblock the Notifications











