భయపెడుతున్నారని అనుకొంటాన్నారేమో.. మీరే భయపడుతున్నారు.. డియర్ కామ్రేడ్ ట్రైలర్ కేక

Recommended Video

Dear Comrade Trailer Is Out || Vijay Devarakonda || Rashmika Mandanna || Filmibeat Telugu

గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, దర్శకుడు భరత్ కమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

 పాలిటిక్స్ ఆపకపోతే..

పాలిటిక్స్ ఆపకపోతే..

డియర్ కామ్రెడ్ ట్రైలర్ చూస్తే కంటెంట్ పరంగా రిచ్‌గా కనిపిస్తున్నది. డైలాగ్స్ భావోద్వేగంగా.. ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. కాలేజీలో పాలిటిక్స్‌ను ఆపకపోతే.. మేమే ఆపాల్సి వస్తుంది అని విజయ్ దేవరకొండ టైలాగ్.. కాలేజీ పాలిటిక్స్, గొడవలను తెలియజేసింది. కాలేజీలో గొడవలు, కొట్లాటలు ఉద్రేకపూరితంగా కనిపించాయి.

 ధైర్యం, తెగువ మంచిదే కానీ

ధైర్యం, తెగువ మంచిదే కానీ

ఇక లవ్ ఎపిసోడ్స్ కూడా ఫీల్‌గుడ్ గా ఉన్నాయి. వచ్చినప్పుడు ఎంతో గొప్పగా ఉన్న ప్రేమ.. పోయిన తర్వాత ఎందుకింత బాధపెడుతున్నది అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కూడా ఎమోషనల్‌గా ఉంది. ఇలాంటి ధైర్యం, తెగువ మంచిదే కానీ. ఈ గొడవలో పొగొట్టుకున్నవే నిన్ను అన్నింటికన్నా ఎక్కువగా బాధపెడుతున్నాయి అంటూ తండ్రి చెప్పించిన డైలాగ్స్ సినిమాలో చైతన్య జీవితంలో ఏదో జరిగిందనే ఫ్లాష్ బ్యాక్‌ను తెలియజేసింది.

పిరికిదానిలా ఉండకు లిల్లీ అంటూ

నీకు తోడుగా ఉంటాను. లెట్ మీ డియర్ కామ్రేడ్ అంటూ భావోద్వేగంగా చెప్పిన మాటలను ప్రేమికులను ఆకట్టుకొనేలా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఉన్న కోపం ఇప్పుడు లేదు. నన్ను మీనాన్నను, ఈ సొసైటీని మరిచిపో. నీకు ఏం కోవాలో దాని కోసమే పోరాటం చేయి. ఇలా పిరికిదానిలా ఉండకు లిల్లీ అంటూ ఇక డైలాగ్స్ సినిమా ఇంటెన్సిటీని తెలియజెప్పింది. ఓవరాల్‌గా ఈ సినిమా మిక్స్‌డ్ బ్యాగ్‌లా కనిపించింది.

తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తదితరులు
దర్శకుడు: భరత్ కమ్మ
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
డైలాగ్స్: జయ్ కృష్ణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని
స్టంట్స్: మురళీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X