Dear Megha Official Teaser: ట్రయాంగిల్ లవ్‌తో ఆసక్తికరంగా ‘డియర్ మేఘ’
ఈ మధ్య కాలంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో కూడిన చిత్రాలు పెద్దగా రావడం లేదు. దీంతో లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులు అలాంటి చిత్రాల కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డియర్ మేఘ'. ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
'డియర్ మేఘ' విడుదలకు సమయం ఆసన్నమైంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ టీజర్‌లో మేఘా ఆకాశ్ పాత్రలోని ఘాడతను చూపించారు. మరీ ముఖ్యంగా ఇది ట్రయాంగిల్‌లో సాగే ప్రేమాయణంలా కనిపిస్తోంది. హీరో అదిత్ అరుణ్ పాత్ర కూడా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా 'ఆ అమ్మాయి.. మిగితా అమ్మాయిలందరినీ మర్చిపోయేలా చేసింది' అని చెప్పే డైలాగ్ బాగుంది. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరింత బలాన్ని ఇచ్చింది. మొత్తంగా ఈ టీజర్ యూత్‌ను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'డియర్ మేఘ' కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'దియా' అనే సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రాన్ని సుశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అర్జున్ దాస్యన్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఆండ్రూ బాబు పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











