Salman Khan : సల్మాన్ కు బెదిరింపులు.. ఈసారి ఎటాక్ ఇలా.. ఏం చేశారో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మళ్లీ డెత్ వార్నింగ్ లు వస్తున్నాయి. ఈ అగ్ర హీరోలకు బెదిరింపులు ఇదే తొలిసారి ఏమీ కాదు. ఇప్పటికే పలుసార్లు మరణ హెచ్చరికలు కూడా గ్యాంగ్ స్టర్స్ నుంచి రావడంతో బాయ్ జాన్ తన జాగ్రత్తలో తను ఉంటున్నాడు. అయితే కొన్నాళ్లుగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు తరుచుగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ హెచ్చిరిస్తూనే వస్తున్నారు. పలు మార్లు ఎటాక్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి హెచ్చరికలు అందాయి.
సల్మాన్ ఖాన్ కు ఈసారి చాలా స్ట్రాంగ్ గా బెదిరింపులు అందాయి. వాట్సాప్ నెంబర్ కు గ్యాంగ్ స్టర్స్ మెసేజ్ పెట్టి మరీ హెచ్చరించడం ఆందోళనకర పరిస్థితికి దారి తీసింది. సల్మాన్ ఖాన్ పై మరోసారి ఎటాక్ చేయడం పక్కా అని వారు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ముంబైలోని వర్లీ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ వాట్సాప్ నెంబర్ కు గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో సల్మాన్ ఖాన్ పై ఎటాక్ చేయబోతున్నామని చెప్పి హెచ్చిరించారు.

అయితే ఈసారి మాత్రం సల్మాన్ ఖాన్ పై ఎటాక్ తప్పనిసరిగా అని, సల్మాన్ ఖాన్ ఇంట్లో చొరబడి మరీ కాల్పులు జరుపుతామని మెసేజ్ లో వెల్లడించారు. లేదంటే సల్మాన్ కారులోనైనా బాంబు పెట్టి పేల్చుతామని, ఎలాగైనా లేపేస్తామని ఆ మెసేజ్ ద్వారా హెచ్చరించారు. దీంతో సల్మాన్ ఖాన్ శ్రేయోభిలాషులు ఆందోళన పడుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఆ నెంబర్ ను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కు మరింత సెక్యూరిటీని ఇవ్వడంతో పాటు బాలీవుడ్ స్టార్ ను అలర్ట్ చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ముంబైలో కేసు నమోదైంది. దర్యాప్తును పోలీసు అధికారులు వేగ వంతం చేశారు. మెసేజ్ పంపించిన వ్యక్తిని కనిపెట్టి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మెసేజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ను బెదిరించింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగేనా లేకా ఇంకెవరైనా అయ్యి ఉంటారా? అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మున్ముందు ఎవరనేది తేలే అవకాశం లేకపోలేదంటున్నారు.
మరోవైపు ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు పలు మార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు గ్యాంగ్ స్టర్స్ దాడులు కూడా జరిపారు. గతేడాది బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పన్వేల్ ఫామ్ హౌస్ లోకి దూరేందుకు కొందరు అపరిచితులు ప్రయత్నించారు. దాంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతగానో కంగారు పడ్డారు. ఈ దృష్ట్యా ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని కూడా నియమించి భారీ భద్రతను అందించింది. సల్మాన్ లేటెస్ట్ ఫిల్మ్ 'సికందర్' షూటింగ్ కూడా సెక్యురిటీ మధ్యనే జరగడం గమనార్హం. ఈసారి రంజాన్ వేడుకలను కూడా సల్మాన్ ఖాన్ ఎంతో పకడ్బందీ సెక్యూరిటీతో జరుపుకున్నారు. ఇంటి వద్ద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా ఏర్పాటు చేయించుకున్నారు. అందులోంచే ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.


Click it and Unblock the Notifications











