డెబ్యూ హీరోయిన్‌తో పూరి తనయుడు రొమాన్స్.. త్వరలోనే!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాష్ పూరి కోసం ఈ చిత్రంలో డెబ్యూ హీరోయిన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోడల్‌గా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అనిల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. తన తనయుడి కోసం ఈ సారి మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన తొలి చిత్రం మెహబూబాని పూరి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Debut heroine for Akash puri next movie

మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో కొంత గ్యాప్ తీసుకుని ఈ సారి మంచి కథ సిద్ధం చేశారట. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంతో పూరి ముందుంటారు. మోడల్‌గా పలు టైటిల్స్ సొంతం చేసుకున్న గాయత్రీ భరద్వాజ్‌ని ఈ ఎంపిక చేశారు. ఈ చిత్రంతో తన కొడుకుని హిట్ ఇవ్వాలని పూరి భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X