Deepika Padukone Ranveer Singh: దీప్‌వీర్ జంటకు పుట్టబోయే బిడ్డ పేరు ఫిక్స్.. ఎంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పుదకోన్, రణ్‌వీర్ సింగ్ సింగ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సెప్టెంబర్ లో తాను డెలవరీ కాబోతున్నట్లు కూడా చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చిన ఈ జంట.. తమకు పుట్టబోయే బిడ్డకు ఇప్పటికే పేరును కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే తమకు ఎవరు పుట్టినా సరే అదే పేరు పెట్టాలనుకుంటున్నట్లు గతంలో రణ్‌వీర్ సింగ్ చెప్పాడు. అయితే ఆ పేరు ఏంటి.. ఈ జంటను పాప కావాలనుకుంటున్నారా, బాబు కావాలనుకుంటున్నారా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దీప్‌వీర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని కొందరు, నిజమేనంటూ మరికొందరు చెప్పగా.. చాలా మందికి క్లారిటీ లేకుండా పోయింది. కానీ తాజాగా దీపికా పదుకోన్.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో క్లారిటీ వచ్చేసింది. ఇలా క్లారిటీ వచ్చిందో లేదో అలా వారికి పుట్టబోయే బిడ్డ గురించి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గంతోల రణ్‌వీర్ సింగ్ ఓ షోలో తనకు పాప కావాలో, బాబు కావాలో చెప్పిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ వీడియోలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తనకు.. తన భార్య దీపిక పదుకోన్ లాంటి ఆడ పిల్ల కావాలని ఉన్నట్లు చెప్పాడు. తన భార్య చిన్నప్పటి ఫొటోలను ఇప్పటికీ చూస్తుంటానని .. అందులే ఆమె చాలా అందంగా అచ్చం దేవకన్యా ఉంటుందని వివరించాడు. అలాగే తనకు పుట్టబోయే బిడ్డ పేరు ముందుగానే ఆలోచించి పెట్టుకున్నానని కూడా చెప్పుకొచ్చాడు. తనకు పుట్టబోయే బిడ్డ పేరు శౌర్య వీర్ సింగ్ అని పెట్టుకోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ముఖ్యంగా దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జంటకు పాప పుడితే శౌర్య వీర్ సింగ్ అని పెట్టుకుంటారు ఓకే. కానీ బాబు పుడితే ఎలా అంటూ ఆ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. మరి కొందరేమో ఎవరు పుట్టినా అదే పేరు పెట్టుకుంటారని.. అది అమ్మాయిలకే పెట్టేలా లేదు కదా అంటూ చెప్పుకొస్తున్నారు. వీళ్లకు పాప పుట్టినా, బాబు పుట్టినా శౌర్య వీర్ సింగ్ అనే నామకరణం చేస్తారంటూ చెప్పుకొస్తున్నారు.

మరి ఈ జంటకు ఎవరు పుడతారు, ఏం పేరు పెడతారు అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే దీపికా డెలవరీ జరగబోయేది సెప్టెంబర్ నెలలోనే. ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా ఉన్న దీపికా పదుకోన్ ఇటీవలే అంతర్జాతీయ అవార్డుల వేదికలో పాల్గొంది. అక్కడే తన బేబీ బంప్ స్పష్టంగా కనిపించడం.. ఆమె కూడా అడ్డుగా కొంగు కప్పుకునే ప్రయత్నం చేయడం అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











