దీపిక, రణ్‌వీర్ కెమిస్ట్రీ మాములుగా లేదుగా.. పెళ్లి తర్వాత కూడా ఆటపట్టించిన..
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి కాకముందు కామెంట్లతో ఒకరిపై మరొకరు రొమాంటిక్‌గా ప్రేమను పంచుకొనేవారు. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వారిద్దరి మధ్య రొమాంటిక్ కామెంట్లు ఉన్నట్టు తాజా పోస్ట్ వెల్లడించింది. రణ్‌వీర్ సింగ్ పెట్టిన పోస్టుపై దీపిక కామెంట్ చేయగా దానికి గమ్మత్తుగా ఎక్స్‌ప్రెషన్ పెట్టారు.

కంటి అద్దాల కంపెనీ కోసం రణ్‌వీర్ ఇటీవల ఫోటోషూట్ చేశాడు. ఆ ఫోటోలను ఆయన తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వెంటనే దానికి స్పందించి స్వీటీ (క్యాండీ) అంటూ కామెంట్ పెట్టింది. దానికి రణ్‌వీర్ నాలిక బయటపెట్టిన ఓ ఎమోజీని పెట్టి రివర్స్ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లకు ఆనందాన్ని పంచింది. వారి కామెంట్లలో అభిమానులు కూడా భాగమయ్యారు.

కెరీర్ విషయానికి వస్తే, డైరెక్టర్ కబీర్ ఖాన్ రూపొందించే 83 చిత్రం కోసం రణ్‌వీర్ సింగ్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ నటించనున్నాడు. ఇక యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఛాపాక్ అనే చిత్రంలో అందవిహీనురాలుగా దీపిక నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











