నా కడుపుకు కారణం ప్రభాస్.. దీపిక పదుకోన్ షాకింగ్ కామెంట్స్!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తోపాటు స్టార్ హీరో, హీరోయిన్లు ప్రభాస్, దీపిక పదుకొన్ హాజరైన కల్కి 2898 ఏడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా నిర్వహించారు. రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ పాల్గొన్నారు. ఈవెంట్‌లో హైలెట్స్ వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ చూసి ఆయన మాదిరిగా కటింగ్ చేయించుకోవాలనుకొనే వారిలో నేను ఒక్కడిని. అలాగే సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు చిత్రం చూసిన తర్వాత కమల్ హాసన్ మాదిరిగా డ్రస్స్‌లు వేసుకొని ఇంటి వాళ్ల ముందు నటించే వాడిని. అలాంటి వారితో కలిసి నటించడం నా జీవితం ధన్యమైంది అని ప్రభాస్ అన్నారు.

అయితే కమల్, అమితాబ్ గురించి మాట్లాడిన ప్రభాస్.. దీపిక పదుకోన్ గురించి మాట్లాడటం మరిచిపోయారు. రానా గుర్తు చేయగానే.. నేను నటించాలనుకొనే హీరోయిన్లలో దీపిక పదుకొన్ ఒకరు. ఆమె అందం, టాలెంటెడ్ హీరోయిన్. ఆమెకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు ఉంది అని ప్రభాస్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక దీపిక పదుకోన్ మాట్లాడుతూ.. నా కడుపు వచ్చిందంటే.. కారణం ప్రభాస్. ఆయన పెట్టిన ఫుడ్ తిని నాకు ఇలా కడుపు వచ్చింది. సెట్‌లో ఆయన అంతగా అందరికి భోజనాలు పెట్టి ఆతిథ్యం ఇచ్చేవారు. ఆయన కోసం ఒక కేటరింగ్ టీమ్ ఉండేది. ఆయన ఇంటి నుంచి భారీగా భోజనాలు తెచ్చి తినిపించే వారు అని దీపిక పదుకోన్ అన్నారు.

నా కెరీర్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమాల్లో నటించడం వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా నాకు కొత్త అనుభూతిని కలిగించింది. నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది అని దీపిక పదుకోన్ అన్నారు.
ఇక ఈవెంట్‌లో అశ్వినీదత్ నుంచి ఫస్ట్ డే ఫస్ట్ టికెట్‌ను అమితాబ్ బచ్చన్ డబ్బులిచ్చి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ టికెట్‌ను కమల్ హాసన్‌కు గిఫ్టుగా ఇచ్చారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. షోలో సినిమా చూడటానికి మూడు వారాలు పట్టింది. అలాంటి యాక్టర్ సినిమా టికెట్ ఫస్ట్ రోజు దక్కింది అని అన్నారు.


Click it and Unblock the Notifications











