twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది.. యాక్షన్ తీసుకోకపోవడంపై కోపంగా ఉంది.. జేఎన్‌యూ ఘటనపై దీపికా

    |

    ఢిల్లీలోని జేఎన్‌యూ (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ సెలెబ్రిటీలెందరో ఈ ఘటనను ఖండిస్తూ.. గాయపడిన విద్యార్థులకు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం చపాక్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా డిల్లీ వెళ్లిన దీపికా పదుకొణె.. విద్యార్థులకు మద్దతు ప్రకటించింది.

    ముసుగు వేసుకుని మూకదాడి..

    ముసుగు వేసుకుని మూకదాడి..

    యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులపై.. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ముసుగు ధరించి వచ్చిన కొంతమంది దుండగులు రాడ్లు, యాసిడ్, పదునైన ఆయుధాలతో విద్యార్థులు, టీచర్లపై దాడి చేస్తూ... దాదాపు రెండు గంటల పాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో రణరంగం సృష్టించారు. ఈ దాడిలో జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా మరో 30 మంది విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

    విద్యార్థులకు అండగా..

    విద్యార్థులకు అండగా..

    ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ.. విద్యార్థులకు మద్దతు తెల్పుతూ దీపిక పదుకొణె జేఎన్‌యూకి వెళ్లింది. దుండగుడల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని పరామర్శించింది. దాడి జరిగిన తీరుపై.. వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం విద్యార్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని విద్యార్థులకు అండగా నిలబడింది.

    బీజేపీ నేత ఫైర్

    బీజేపీ నేత ఫైర్

    దీపికా పదుకొణె జేఎన్‌యూకు వెళ్లడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా మండిపడ్డాడు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శించాడు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. జేఎన్‌యూ ఘటనపై దీపికా స్పందించిన తీరును నిరసిస్తూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం చపాక్‌ను నిషేధించాలంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో #BoycottChhapaak అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

    చాలా బాధేస్తోంది..

    చాలా బాధేస్తోంది..

    ‘ఈ ఘటన చాలా బాధను కలిగిస్తోంది. రెండేళ్ల పద్మావత్ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు అదే చెప్పాను.. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఇలాంటి దాడులు సర్వసాధారణం కాకూడదు. నాకు చాలా బాధతో పాటు భయంకూడా వేస్తోంది. మన దేశానికి ఇవి సరైనవి కావు. జరిగిన దానిపై ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై నాకు కోపం వస్తోంద'ని ఓ మీడియాతో చెప్పుకొచ్చింది.

    English summary
    Deepika Padukone Visited JNU. Netizens Fires On Deepika And They Want to Boycott Chhapaak Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X