బ్రేకింగ్.. ప్రభాస్ సరసన దీపికా పదుకోన్.. తొలిసారి టాలీవుడ్‌లోకి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. లాక్‌డౌన్ కారణంగా ప్రభాస్ సినిమాను చూడలేకపోతూ నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపేందుకు Prabhas20 యూనిట్ క్రేజీ వార్తను అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు సంబంధించి ఓ ఆసక్తి వార్తను అందించేందుకు యూనిట్ రెడీ అయింది. ఈ విషయంపై ప్రభాస్ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి రావడం గమనార్హం.

అయితే ప్రభాస్21 సినిమాకు సంబంధించిన ఓ కీలక సమాచారాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు యూనిట్ వెల్లడించనున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటిస్తున్నారనే వార్తను అభిమానులతో పంచుకోనున్నారు.
ఇక ప్రభాస్21 సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైంటిఫిక్, ఫిక్షన్ మూవీగా ప్యాన్ వరల్డ్ ఫీల్ కల్పించే విధంగా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











