twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కపిల్ దేవ్ బయోపిక్.. భార్య భర్తలుగా రణవీర్ సింగ్, దీపిక!

    |

    లెజెండరీ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. 1983లో టీం ఇండియా సాధించిన ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 83 అనే టైటిల్ ఖరారు చేశారు. కబీర్ ఖాన్ దర్శత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఇతర ప్రధాన క్రికెటర్స్ పాత్రల కోసం దర్శకుడు నటీనటుల వేట ప్రారంభించాడు.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

    ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రియల్ లైఫ్ కపుల్స్ అయిన దీపికా, రణవీర్ ఈ చిత్రంలో కూడా భార్య భర్తలుగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కపిల్ దేవ్ సతీమణి పాత్రలో దీపికా నటించబోతోందట. ప్రస్తుతం దర్శకుడు దీపికతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీం ఇండియాకు తొలి క్రికెట్ ప్రపంచకప్ కపిల్ దేవ్ సారథ్యంలోనే వచ్చింది. దీనితో కపిల్ దేవ్ జీవిత చరిత్రని వెండి తెరపై ఆవిష్కరిస్తే మంచి కథ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

     Deepika Padukone playing Ranveer Singh’s onscreen wife in Kapil Dev’s biopic

    ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవితాల ఆధారంగా బయోపిక్ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ సతీమణి రోమి భాటియా 1983 ప్రపంచకప్ సందర్భంగా స్టేడియంలోని ఉన్నారు. ఇండియా గెలవదనే అనుమానంతో ఆమె స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారట. ఇండియా విజయం సాధించిందని తెలుసుకుని తిరిగి స్టేడియంలోకి వచ్చారట. తన భర్త సారథ్యంలో టీం ఇండియా ప్రపంచకప్ గెలవడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అలాంటి ఎమోషనల్ సీన్స్ లో దీపికా బాగా నటిస్తుందని దర్శకుడు కబీర్ ఖాన్ భావిస్తున్నారు.

    English summary
    Deepika Padukone playing Ranveer Singh’s onscreen wife in Kapil Dev’s biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X