దీపిక పదుకొనేపై పీవీ సింధు కామెంట్స్.. ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందంటే!
అంతర్జాతీయ బ్యాట్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు విశేష ఖ్యాతి తెచ్చుకుంటోంది. గతంలో అనేక పతకాలు చేజిక్కించుకొని తన టాలెంట్ చూపించిన ఈమె.. ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. దీంతో ఆమెను వరుస పెట్టి ఇంటర్వ్యూలు చేశాయి మీడియా సంస్థలు.
అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా పీవీ సింధు, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనేపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్లలో కెల్లా తనకు దీపిక పదుకొనే అంటే చాలా ఇష్టమని, ఆమెలో అందంతో పాటు టాలెంట్ పుష్కలంగా ఉందని కితాబిచ్చింది పీవీ సింధు. దీంతో ఈ ఇంటర్వ్యూ చూసిన దీపిక పదుకొనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రియాక్ట్ అయింది. 'లవ్ యూ ఛాంప్' అంటూ పీవీ సింధుపై తన ప్రేమను చూపించింది దీపిక.

మరోవైపు పీవీ సింధు జీవితానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే పీవీ సింధు బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యాడు సోనుసూద్. ఈ సినిమాలో పీవీ సింధు పాత్రలో దీపిక పదుకొనేనే నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబందించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











