దీపిక, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్ విచారణ పూర్తి.. మరోసారి విచారణకు సమన్లు?
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్‌తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణ ముగిసింది. సారా ఆలీ ఖాన్‌ను నాలుగున్నర గంటలపాటు, శ్రద్దాకపూర్‌ను ఆరు గంటలపాటు విచారించారు. శ్రద్దాకపూర్‌ను విచారించడానికి ఎన్సీబీ ఉన్నతాధికారి కేపీఎస్ మల్హోత్రా స్వయంగా కార్యాలయానికి వచ్చారు.
శనివారం విచారణలో భాగంగా దీపిక పదుకోన్ డ్రగ్ చాటింగ్ విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. అయితే అధికారులు అడిగిన మిగిత ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలపై ఎన్సీబీ సంతృప్తి చెందనట్టు సమాచారం. ఈ క్రమంలో దీపికా పదుకోన్‌ను మరోసారి విచారించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. త్వరలోనే సమన్లు జారీ చేస్తారనే విషయంతో దీపిక, రణ్‌వీర్ సింగ్ దంపతులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, కరణ్ జోహర్ సన్నిహితుడు క్షతిజ్ రవి ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్లీ ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ విచారణలో అనేక విషయాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ అత్యంత అవసరమని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలో ఆయనను అరెస్ట్ చేశారని ఎన్సీబీ వర్గాలు ధృవీకరించాయి.


Click it and Unblock the Notifications











