ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దీపికా.. సీన్ చూసి షాకవుతున్న జనం
బాలీవుడ్ భామ దీపికా పదుకొనె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రవర్తించిన తీరు చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈమె సింప్లిసిటీ చూసి షాకవుతున్నారు జనం. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌ని అయినా తానూ ఓ సాధారణ మహిళనే అన్నట్లుగా ప్రవర్తించింది దీపికా. ముంబై ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో ఆమె మెలిగిన తీరు ఆమెలోని వినయానికి అద్దం పడుతోంది.
సాధారణంగా సెలెబ్రిటీలు బయటకొచ్చినప్పుడు అందరికీ ఓపికగా సమాదానాలు చెప్పలేరు. వారికి సంబందించిన వివరాలు, ప్రూఫ్స్ అడిగితే కాస్త సతాయించడం కొన్ని సందర్బాల్లో చూసాం. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించింది దీపికా పదుకొనె. తన తండ్రి ప్రకాశ్ పదుకొణెతో కలిసి ముంబయి విమానాశ్రయానికి విచ్చేసిన దీపికా పదుకొనెను అక్కడున్న సెక్యూరిటీ అడ్డుకొని.. మీ ఐడీ కార్డు చూపించాలంటూ అడిగారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్నవాళ్లు దీపికా పదుకొనె అంటూ ఐడీకార్డు చూపించకుండా వెళ్లిపోతుండగా.. సెక్యూరిటీ ఐడీ కార్డు మస్ట్ అని అన్నాడు. దీంతో వెంటనే తన బ్యాగ్ లోంచి ఐడీ కార్డు తీసి ఆ సెక్యూరిటీకి చూపించింది దీపికా.

ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సెలబ్రిటీని ఇలా అడగడం, దానిపై ఆమె సాధారణ వ్యక్తిలా స్పందించడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెటిజన్లు. దీపిక సో స్వీట్, భద్రతా సిబ్బంది వారి పని వారు చేశారు, దానిపై దీపిక చక్కగా స్పందించారు, రియల్లీ క్లాసీ గర్ల్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. నిజానికి ఓ సెలెబ్రిటీ ఇంత వినయంగా స్పందించడం సెలెబ్రెటీల్లో వస్తున్న మార్పులకు చిహ్నంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











