Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
దీపిక పదుకోన్‌కు బంపర్ ఆఫర్.. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్‌లో!
అందాల భామ దీపిక పదుకోన్ విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో దూసుకెళ్తున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారం ఉన్న రోల్స్‌లో ప్రేక్షకులను మెప్పిస్తున్నది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో పఠాన్ చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు.
బాలీవుడ్‌తోపాటు తెలుగులో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఈ సుందరి ప్రస్తుతం హాలీవుడ్ సంచలన విజయం సాధించిన ది ఇంటెర్న్ సినిమాలో నటించడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
హాలీవుడ్ చిత్రం ది ఇంటెర్న్లో రాబర్ట్ డీ నీరో, అన్నా హాతావే నటించారు. ప్రతిభవంతురాలైన అన్నా హాతావే పాత్రలో దీపిక పదుకోన్ నటించనున్నారనే విషయం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ది ఇంటర్న్ సినిమా ఆధారంగా తెరకెక్కే చిత్రానికి బాదాయి హో దర్శకుడు అమిత్ శర్మ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
అయితే ఇప్పటికే ది ఇంటర్న్ సినిమాపై దీపిక పదుకోన్ మనసు పారేసుకొన్నది. ఆ చిత్రంలో పాత్రల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు తనకు అత్యంత ఇష్టంగా మారాయని ఇటీవల ఇంటర్యూలో దీపిక చెప్పుకొచ్చారు.