Rashmika Deep Fake Video.. రష్మిక మందన్న అసభ్య వీడియో కేసు.. నలుగురు అనుమానితుల అరెస్ట్?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన చత్రాలు చేస్తూ.. అంతకు మించిన నటను చూపిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుందీ ముద్దుగుమ్మ. ఈ మధ్య యానిమల్ చిత్రంలో ఈమె నటనకు సంబంధించిన వార్తలు రాగా.. అంతకు ముందు మాత్రం సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా మొత్తం రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో గురించే రచ్చ అయింది. ఈమెది వచ్చిన తర్వాత మరెంతో మంది హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
కానీ మొదటి సారి రష్మిక వీడియోనే వైరల్ కావడంతో.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై స్పందించారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు కూడా నోరు విప్పారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రష్మకకు అండగా ఉంటామని చెబుతూ.. అంతా తమ గళం వినిపించారు. అయితే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులు ఢిల్లీ పోలీసులు నలుగురు అనుమానితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు అనుమానితులను పట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ వీడియోను అప్ లోడే చేసింది ఈ నలుగురు నిందితులే అయినప్పటికీ.. వీడియోను క్రియేట్ చేసింది మాత్రం వీళ్లు కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సాయంతో వీడియోను సృష్టించారని... వారిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు. ముఖ్యంగా ఈ నలుగురు నిందితులను పట్టుకోవడాని... ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సంస్థలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అయితే డీప్ ఫేక్ వీడియోను నిందితులు వారి ఖాతాల నుంచి తీసేయడంతో... నిందితులను పట్టుకోవడం సమస్యగా మారింది.

డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు నమోదు చేసిన నెల రోజులు అవుతున్నా ఇంకా అసలు నేరస్తులు దొరక్కపోవడం గమనార్హం. ముఖ్యంగా నటి రష్మికా మందన్నా డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. నవంబర్ 6వ తేదీన రష్మిక మందన్నాకు సంబంధించిన ఈ మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన రష్మిక సోషల్ మీడియో వేధికగా వీడియో చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ కేసు నడుస్తుండగానే... బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ఆలియా భట్, కరీనా కపూర్ లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











