twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్లు తెలియకుండా ఒకే బెడ్ మీద నాగ్-నాని.... ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Today's Viral Pic: Nagarjuna,Nani's DevaDas Movie First Look

    కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న చిత్రం 'దేవదాస్'. ఇందులో దేవ అనే పాత్రలో నాగార్జున, దాస్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. తప్పతాగి ఒళ్లు తెలియకుండా ఒకే బెడ్ మీద పడుకున్న పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. తన ట్విట్టర్ ద్వారా నాని పోస్టర్ షేర్ చేశారు.

    నాని ఆసక్తికర కామెంట్

    1996లో ‘నిన్నే పెళ్లాడతా.... నాగ్ సర్ స్క్రీన్ మీద, నేను దేవి 70 ఎంఎం థియేటర్ బయట క్యూలైన్లో...

    2018లో ‘దేవదాస్'... ఇద్దరం ఫస్ట్‌లుక్ పోస్టర్లో... బాగా మద్యం సేవించి ఒళ్లు తెలియకుండా... ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని నాని ట్వీట్ చేశారు.

    డాక్టర్ పాత్రలో నాని

    డాక్టర్ పాత్రలో నాని

    శాంతభాయ్ మెమోరియల్ చారిటీ హాస్పటల్‌లో పని చేసే డాక్టర్ పాత్రలో నాని నటిస్తున్నారు. శాంతభాయ్ మెమోరియల్ చారిటీ హాస్పటల్‌తో దేవ, దాస్‌కు సంబంధం ఉంటుందని తెలుస్తోంది.

     సరదాగా సాగే మూవీ: నాగార్జున

    సరదాగా సాగే మూవీ: నాగార్జున

    గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. `ఇది చాలా స‌ర‌దాగా సాగిపోయే సినిమా. నేను డాన్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను. నాకు వైద్యం చేసే డాక్ట‌ర్ పాత్ర‌లో నాని క‌నిపిస్తాడని తెలిపారు.

    సెప్టెంబర్ 27న విడుదల

    సెప్టెంబర్ 27న విడుదల

    ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, నిర్మాత: సి.అశ్వనీదత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య.

    English summary
    Nagarjuna, Nani Multi Starrer Titled as Devdas first look poster released. "1996 - Ninne pelladtha .. Nag sir on screen .. me in the queue outside Devi 70MM2018 - DevaDas - we both on the First Look .. drunk and sloshed. DevaDas This is going to be fun :))" Nani tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X