YSR, CBN స్నేహంపై ఇంద్రప్రస్థం.. ఆ ఆటకున్న కిక్కేవేరు!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నిజ జీవితాలకు సంబంధించిన కథలకు ఏ స్థాయిలో క్రేజ్ అందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొన్నటివరకు బయోపిక్స్ హవా నడిస్తే.. ఇప్పుడు బయోపిక్ అనే పదానికి దగ్గరగా ఉండే మరో తరహా సినిమాలు తెరకెక్కుతున్నాయి. కేవలం ఒక పాయింట్ ని ఎంచుకొని రియల్ లైఫ్ కథలను అద్భుతంగా చూపిస్తున్నారు కొందరు దర్శకులు.

ఇక ప్రయోగాత్మక కథలను రాసుకునే దర్శకుడు దేవకట్టా కూడా మరోసారి ఇద్దరు రాజకీయ నాయకులకు సంబంధించిన స్నేహం అనే పాయింట్ ని ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఇంద్రప్రస్థం (వర్కింగ్ టైటిల్) అనే సినిమాను దేవకట్టా తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

deva katta Indraprastham Theme Motion Poster

ఆంద్రప్రదేశ్ పొలిటీషియన్స్ నుంచి స్పూర్తి పొంది తెరకెక్కిస్తున్న సినిమా అని దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ప్రపంచంలో జరిగే పోటీలన్నీటికీ పర్పస్ ఒక్కడే.. విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ ప్రపంచాన్ని ఏలుతారు. అయితే ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు అంటూ దేవకట్టా చెప్పిన డైలాగ్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

ఇటీవల దేవకట్టా ఈ సినిమాకు సంబంధించిన ఐడియాపై మరో నిర్మాత కన్నేశారని తన ఆలోచనలను కాపీ కొడుతున్నారని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజులకే ఆ నిర్మాత కంటే ముందే తన ఐడియాను సెట్స్ పైకి తెచ్చాడు దేవకట్టా. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X