మగధీర, బాహుబలి, ఈగ, RRRలకు రెండింతలు.. వారణాసిపై అంచనాలు పెంచేసిన స్టార్ డైరెక్టర్..

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ గ్లోబల్ ఎపిక్ మూవీ వారణాసి( Varanasi). ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన టైటిల్ లాంచ్ ఈవెంట్‌తో సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించగా, విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందనే చెప్పాలి. ఇలా ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన అందుకుంటున్న ఈ గ్లోబల్ మూవీపై తెలుగు రచయిత, దర్శకుడు దేవ కట్ట 'వారణాసి'కి డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న వారణాసి మూవీలో సూపర్‌స్టార్ మహేష్ బాబు రుద్ర (Rudhra)పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీకి కథను విజయేంద్ర ప్రసాద్ రచించగా, సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో K.L. నారాయణ (దుర్గా ఆర్ట్స్) నిర్మిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 2027లో గ్రాండ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు.

Deva Katta Says Rajamouli Mahesh Varanasi Is a Combination of Baahubali Magadheera RRR Eega
అంతేకాకుండా వారణాసి కోసం రాజమౌళి గ్లోబల్ స్థాయిలో మార్కెట్ ప్లానింగ్ చేస్తున్నారట. ఈ మూవీలో హాలీవుడ్ టెక్నీషియన్లు, పాన్ ఇండియా-పాన్ వరల్డ్ క్యాస్టింగ్, మైథాలజికల్ ఎలిమెంట్స్ అన్ని వారణాసి మూవీని వర్డల్‌వైడ్ గా చర్చనీయంగా మార్చేశాయి.ఈ గ్లోబల్ ఇండియన్ ఎపిక్ 2027లో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇటీవల మహేష్ బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో 'వారణాసి సినిమా మొత్తం భారతదేశాన్ని గర్వపడేలా చేస్తుంది' అని హైప్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికే కీరవాణి స్వరపరిచిన 'సంచారి' పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలవడం, రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెంచాయి.

వారణాసి మూవీకి డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్న దర్శకుడు దేవ కట్ట తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేవకట్ట మాట్లాడుతూ.. "మగధీర, ఈగ, బాహుబలి, RRR సినిమాలను కలిపి, వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ వారణాసి" అంటూ ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. రాజమౌళి విజన్, విజువల్ ప్రెజెంటేషన్ లాంటి అంశాలు గత స్థాయిని మించి ఉన్నాయని దేవ కట్ట స్పష్టంగా చెప్పారు. "వారణాసి స్క్రిప్ట్ నాకే ఇచ్చినా నేను ఆ స్థాయిలో తెరకెక్కించలేను. అది పూర్తిగా రాజమౌళిగారే చేయగలిగే సినిమా" అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజమౌళి విజన్ మీద మళ్లీ చర్చలు తెరపైకి తెచ్చాయి.

భారతీయ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచేలా ఈ సినిమా రూపొందుతుందనే అంచనాలు పరిశ్రమలోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లోనూ వ్యక్తమవుతున్నాయి. టైటిల్ లాంచ్ తర్వాతే ఈ స్థాయి రియాక్షన్ రావడం ఇప్పుడే సినిమాకు ఉన్న స్థాయి హైప్‌ను అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి సినిమాలన్నింటికంటే రెండింతలు చేస్తే వారణాసి అని, షాకింగ్ విజువల్ ఎపిక్‌గా రూపుదిద్దుకుంటోందని డైలాగ్ రైటర్ దేవ కట్ట స్వయంగా ప్రకటించడం వల్ల వారణాసి పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్‌ గా చూస్తున్నారు. షూటింగ్ దశలోనే ఇలాంటి టాక్ వస్తే.. 2027 వరకు వేచి చూడాల్సి వచ్చినప్పటికీ, వారణాసిపై గూస్‌బంప్స్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యాయన్న మాట.

More from Filmibeat

Read more about: Varanasi ss rajamouli deva katta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X