Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘దేవదాస్’ టీజర్: పెగ్గు మీద పెగ్గేస్తున్న నాని, నాగార్జున షాక్
Recommended Video
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానితో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న మల్టీ స్టారర్ 'దేవదాస్'. టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్... నాగార్జున, నాని ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజర్ విడుదల చేశారు. స్మాల్ పెగ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్లో నాగార్జున, నాని మందేస్తూ కనిపించారు.
|
ఈ రోజు మంచి రోజంట
ఈ టీజర్ నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.... ‘ఈ రోజు మంచి రోజు అంట నాకు ఒక పెగ్ ప్లీజ్' అంటూ ఫన్నీ కామెంట్ పోస్టు చేశారు.
పెగ్గు మీద పెగ్గేస్తున్న నాని, నాగార్జున షాక్
ఇందులో దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని నటిస్తున్నారు. టీజర్ వీడియోలో నాని పెగ్గు మీద పెగ్గేస్తుండటం, అది చూసి నాగార్జున షాకవ్వడం ఫన్నీగా ఉంది.
మల్టీ స్టారర్ మూవీ
మల్టిస్టారర్ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో రాబోతోన్న దేవదాస్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
దేవదాస్
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి. పట్టి, శ్రీరామ్ ఆర్. ఇరగం, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, కో-డైరెక్టర్: తేజ కాకుమాను, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్ ఆదిత్య. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.