నాగార్జున-నాని ‘దేవదాస్’ స్మాల్ పెగ్ ముహూర్తం ఫిక్స్
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం 'దేవదాస్'. ఈ నెల మొదటి వారంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ ఇద్దరూ స్టార్లు కలిసి అభిమానులకు స్మాల్ పెగ్ ఇవ్వబోతున్నారు. ఈ స్మాల్ పెగ్ ఏంటి? అనుకుంటున్నారా? వీళ్ల భాషలో స్మాల్ పెగ్ అంటే టీజర్ అని అర్థం. శుక్రవారం(ఆగస్టు 24) సాయంత్రం 5 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నారు.
ఇందులో దేవ అనే పాత్రలో నాగార్జున, దాస్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. మల్టిస్టారర్‌ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో రాబోతోన్న దేవదాస్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి. పట్టి, శ్రీరామ్ ఆర్. ఇరగం, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, కో-డైరెక్టర్: తేజ కాకుమాను, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్ ఆదిత్య. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.



Click it and Unblock the Notifications











