OTT: "దేవర" బిగ్ సర్‌ప్రైజ్.. ఎన్టీఆర్ సత్తాకు అసలు పరీక్ష..
భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చివేసిన పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో ప్రెజెంట్ అయితే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాసివ్ ప్రాజెక్ట్ లు బాహుబలి 2 , ఆర్ ఆర్ ఆర్ సినిమాలే కనిపిస్తాయి అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ కంటే బాహుబలి 2 పెద్ద హిట్, వసూళ్లు కూడా ఎక్కువే వచ్చినప్పటికీ గ్లోబల్ లెవెల్లో మాత్రం RRR ఫేమ్ ని బాహుబలి 2 మ్యాచ్ చేయలేకపోయింది.
ఇలా RRR సినిమాకి సెన్సేషనల్ రీచ్ దక్కడంతో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి కూడా పాన్ వరల్డ్ సినిమా దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ చిత్రంతో దర్శకుడు మాత్రమే కాకుండా హీరోలు కూడా గ్లోబల్ లెవెల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌లకి ఆర్ ఆర్ ఆర్ అనంతరం భారీ క్రేజ్ వెస్ట్రన్ ఆడియెన్స్ లో వచ్చింది.

మరి వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంత క్రేజ్ తెచ్చుకోడానికి లేదా చరణ్, ఎన్టీఆర్ లకి రీచ్ రావడానికి థియేట్రికల్ రిలీజ్ కాదు ఓటిటిలోకి రావడమే కారణం అని చెప్పాలి. అది కూడా ఈ క్రెడిట్ దాదాపు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కే చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడైతే హిందీ సహా ఇతర ఇంటర్నేషనల్ భాషల్లో విడుదల చేశారో అక్కడ నుంచి ఇద్దరు హీరోలకి మంచి ఫేమ్ వచ్చింది.
కాగా ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమాతో తన సత్తా ఏంటి అనేది ప్రూవ్ కావాల్సిన సమయం వచ్చింది . తాను నటించిన RRR అనంతరం ఎన్టీఆర్ చేసింది "దేవర". కొరటాల శివతో చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇపుడు అదే నెట్ ఫ్లిక్స్ లో ఇంటర్నేషనల్ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చి బిగ్ ట్విస్ట్ అండ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇన్ని రోజులు కేవలం దక్షిణాది భాషల్లోనే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇపుడు పలు ఇంటర్నేషనల్ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.

కాగా దేవర ఇపుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలు సహా ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్ ఇంకా బ్రెజిలియన్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది సర్ప్రైజ్ అని చెప్పాలి. గతంలో RRR కి హిందీ సహా ఇతర భాషల్లో వచ్చినపుడే అది కూడా నెట్ ఫ్లిక్స్ నుంచే ఇంగ్లీష్ జనం ఎన్టీఆర్ కోసం మాట్లాడారు.
మరి ఇపుడు దేవర కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ ఆడియెన్స్ లో నిజంగా ఎన్టీఆర్ అంటే ఇప్పటికీ యాక్సెప్టెన్స్ ఉందో లేదో? అనేది తారక్ గ్లోబల్ ఫేమ్ కి పరీక్షే అని చెప్పాలి. మరి చూడాలి ఇప్పటి నుంచి దేవర కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని. ఈ సినిమాలోనూ కొన్ని హాలీవుడ్ లెవెల్ సీక్వెన్స్ లు ఉన్నాయి . మరి అవి ఏమేరకు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయో లేదో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











