కమిట్మెంట్ అడిగితే తప్పేంటి ? దేవర బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Devara Latha Vishwanath: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది. ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ .. భైర అనే విలన్ పాత్రలో నటించారు. భైర కొడుకు పసురా.. పసురాకు చంద్రకళ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. చంద్రకళ క్యారెక్టర్ లో హాట్ లూక్స్ మెస్మరైజ్ చేసిన అమ్మడు లతా విశ్వనాథ్ రెడ్డి. చంద్రకళ అనే పాత్ర లో లతా విశ్వనాథ్ రెడ్డి నటించి, మెప్పించింది. ఈ పాత్ర మాస్ ఆడియన్స్ తెగ నచ్చేసింది. ఈ అమ్మడు కనిపించింది రెండు, మూడు సీన్లలో అయినా తన మెస్మరైజ్ లూక్స్ తో యూత్ ఫెవరెట్‌గా మారిపోయింది లతా విశ్వనాథ్ రెడ్డి . అయితే.. తాజాగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మీరు కూడా ఓ లూక్కేయండి.
తెలుగు అమ్మాయి లతా విశ్వనాథ్ రెడ్డి.. దాదాపు 8 ఏండ్లుగా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె నటించిన వాటిలో HIT 2, వాల్తేరు వీరయ్య, సర్కారు నౌకరి, బాలుగాని టాకీస్ వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేవర మూవీ తో లతా రెడ్డి స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా లతా రెడ్డికి అద్భుతమైన ఫాలోయింగ్ వచ్చింది. తన కెరీర్ , పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను, తన హాట్ అండ్ టెంప్టింగ్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తుంది. కుర్రాకారును మంత్రముగ్దులను చేస్తుంది. అలాగే వరుస సినిమా ఆఫర్ అందుకుంటూ.. బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారు. తాజాా ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది.

దేవర ఫేమ్ లతా విశ్వనాథ్ రెడ్డి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..దేవర ఫేమ్ లత విశ్వనాధ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు కదా మీరు కూడా ఎదుర్కొన్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు మీరు ఏమైనా కాస్టింగ్ కావచ్చు ఎదుర్కొన్నారా అని లతా రెడ్డి తిరిగి ప్రశ్నించింది. తమకు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని సమస్య లేదని యాంకర్ బదులిచ్చింది.
'మీకే కాస్టింగ్ కౌచ్ సమస్య లేనప్పుడు మాకెందుకు ఉంటుంది' అని దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది లతా రెడ్డి. 'ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ప్రతి ఇండస్ట్రీలో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. వారి మధ్య అట్రాక్షన్ రావడం కూడా కామన్. వాళ్లు అడగడంలో తప్పేం లేదు. అలాగని మనం నో చెప్పడంలో కూడా తప్పేం లేదని అది కామన్' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని, దేవర మూవీలో నటించిన తన అదృష్టమని, కానీ హీరో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయారని బాధపడ్డారు. ఫ్యూచర్లో అవకాశం ఉంటే తాను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తనకు ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించాలని కోరికగా ఉందని, జస్ట్ రెండు లేదా మూడు సీన్స్ నటించిన లైఫ్ ఫుల్ ఫీల్ అయిందని భావిస్తానన్నారు.


Click it and Unblock the Notifications











