Saif Ali Khan: కరీనా, పిల్లలను కాపాడబోయి.. సైఫ్ ప్రాణాలకు తెగించి.. అగంతకుడి చేతిలో!

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తన నివాసంలో ఓ అగంతకుడి చేతిలో కత్తిపోట్లకు గురి కావడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఇంటి సిబ్బందితోపాటు తన కుటుంబపై దాడి చేసే ప్రయత్నాన్ని సైఫ్ ప్రాణాలకు తెగించి అడ్డుకొనే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడటం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. అయితే ఈ దాడి ఘటనలో సైఫ్ చేసిన సాహసం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. హత్యాయత్నం గురించిన వివరాలు, సైఫ్ గాయపడిన సంఘటన గురించిన విషయాల్లోకి వెళితే...

ముంబైలోని బ్రాందాలోని సైఫ్ ఆలీ ఖాన్‌‌కు చెందిన విలాసవంతమైన నివాసంలోకి హై సెక్యూరిటీ కళ్లుగప్పి అగంతకుడు ప్రవేశించాడు. ఇంట్లోకి వచ్చిన దొంగను గమనించిన సిబ్బంది అతడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఇంట్లో అలజడి, గొడవ వినిపించడంతో సైఫ్ అలర్ట్ అయి సిబ్బందికి అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. దొంగకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సిబ్బందిని వదిలేసి అగంతకుడు సైఫ్‌పైకి పదునైన ఆయుధంతో దూకాడు అని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించినట్టు సమాచారం.

Devara Fame Saif Ali Khan was helping his family climb down the stairs when intruder attacked Here is complete report on Murder attack on Actor

సైఫ్ నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశాడు. సిబ్బందిని పురమాయించి.. అగంతకుడి దాడిని అడ్డుకొనేందుకు చర్యలు తీసుకొన్నాడు. అయితే తన భార్య కరీనాను, తన కుటుంబ సభ్యులను పై అంతస్తుకు చేర్చే ప్రయత్నం చేశాడు. వారిని మెట్ల ద్వారా పైకి పంపించే ప్రయత్నం చేస్తుండగా అగంతకుడు సైఫ్‌పై దాడికి ప్రయత్నించాడు అని సిబ్బంది ద్వారా తెలిసిన సమాచారం. అయితే ఎంత మంది అగంతకులు ఇంట్లోకి చొరబడ్డారు? వారెవరూ అనే విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

తన కుటుంబానికి ఎలా హానీ జరగకుండా సైఫ్ అగంతకుడిని వారించాడు. ఫ్యామిలీ మెంబర్స్‌కు, దొంగకు మధ్య నిలిచాడు. ఈ క్రమంలోనే సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు పడ్డాయి. ఒకటి వెన్నుముక సమీపంలో బలమైన గాయమైంది. మొత్తం ఆరు కత్తిపోట్లు కాగా, రెండు చోట్ల లోతుగా బలంగా గాయాలు అయ్యాయి అని లీలావతి హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

Devara Fame Saif Ali Khan was helping his family climb down the stairs when intruder attacked Here is complete report on Murder attack on Actor

సైఫ్ ఆలీ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ఈ ఘటన తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన ఆయనను సుమారుగా 3.30 గంటల ప్రాంతంలో లీలావతీ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు సర్జరీని నిర్వహిస్తున్నారు. సర్జరీ తర్వాత ఏ మేరకు ఆయన ఆరోగ్యానికి హాని కలిగిందనే విషయంపై స్పష్టత ఇస్తాం అని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X