దేవరకి ఆచార్య లింక్ ఉందా? దీనిపై కొరటాల సమాధానం ఏమిటంటే?

చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ కి వస్తుంది. కాగా ఆ హీరోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాగా తాను నటించిన పాన్ ఇండియా చిత్రమే "దేవర". మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ కాంబినేషన్ నుంచి రెండో సినిమాగా వస్తుండగా దీనిపై చాలానే రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా సినిమా రిజల్ట్ పై చాలా ఉత్కంఠ అందరిలో నెలకొంది.

కాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ నుంచి అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ లో చాలా షాట్స్ అలాగే సముద్ర ప్రాంతం దేవర, అక్కడ జనాలు ఇద్దరు పాత్రలు అన్నీ కూడా కొరటాల గత డిజాస్టర్ సినిమా ఆచార్య కి ప్రతిబింబిస్తున్నాయి అని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనితో చాలా వరకు ఆచార్య వైబ్స్ దేవర లో కూడా కనిపించాయని టాక్ నడిచింది.

devara linked with acharya also devara coming with 3 sentiments

ఇంకా ముఖ్యంగా ఆచార్య లో పాద ఘట్టం, దివ్యవనం లాంటి ఫిక్షనల్ ప్రాంతాల్లానే దేవర లో కూడా కొండ, సముద్రం లాంటి వాటిని ఫిక్షనల్ గా క్రియేట్ చేసారని రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై కొరటాల కుండ బద్దలు కొట్టారు. ఆచార్య లా ఇది ఫిక్షనల్ ప్రాంతాలు కాదు అని దేవర సినిమా మొత్తం తమిళనాడు బార్డర్ దగ్గరలో జరిగే కథ అన్నట్టుగా కొరటాల రివీల్ చేశారు.

దీనితో ఆచార్య తో ఎలాంటి లింక్ లేదని క్లియర్ అయ్యిపోయింది. ఇక ఈ చిత్రం మొత్తం మూడు సెంటిమెంట్స్ తో రాబోతుంది. అవి ఈ సినిమా హిట్ అవుతుంది లేదో అనేవి చూపించనున్నాయి. కాగా ఆ మూడు చూసినట్టు అయితే రాజమౌళి సెంటిమెంట్, ఎన్టీఆర్ సెంటిమెంట్ అలాగే అనిరుద్ సెంటిమెంట్స్ ఉన్నాయి.

devara linked with acharya also devara coming with 3 sentiments

రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరో నెక్స్ట్ సినిమా డిజాస్టర్ అని ఒక బ్రాండ్ ఉండిపోయింది. దానిని దేవర బ్రేక్ చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ కూడా ఓ ప్లాప్ దర్శకుడితో వర్క్ చేస్తే ఆ సినిమా డెఫినెట్ గా వర్క్ అవుతుంది. ఇదొక సెంటిమెంట్ కాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఏదన్నా సినిమాకి హిట్ పోస్ట్ చేస్తే అది భారీ హిట్ అయ్యి తీరుతుంది.. అలా ఈ మూడు సెంటిమెంట్స్ దేవర పై కనిపిస్తున్నాయి.

కాగా వీటిలో రెండు సినిమా హిట్ అని ఒకటి మాత్రం ప్లాప్ అని చూపిస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజం అవుతుందో చూడాల్సిందే. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తాను ఈ సినిమాతోనే తెలుగు ఎంట్రీ ఇస్తుండగా తనతో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. అలాగే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మాణం వహించారు. సుమారు ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని ఒక అంచనా..

More from Filmibeat

Read more about: acharya devara jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X