Devara Leaks: దేవర మూవీకి లీకుల షాక్.. అనిరుధ్, కొరటాల శివ వ్యూహాత్మకంగా!

రానున్న రోజుల్లో ఇండియా సినిమా నుంచి మరిన్ని భారీ పాన్ ఇండియా సినిమాలు డెలివర్ కానున్నాయి. వీటిలో ఆల్రెడీ కల్కి 2898 ఎడి, తాజాగా భారతీయుడు 2 అంటూ పలు భారీ చిత్రాలు సౌత్ సినిమా మార్కెట్ నుంచి రాగ నెక్స్ట్ కొన్ని నెలల్లో మరిన్ని చిత్రాలు బిగ్ స్టార్స్ నుంచి రానున్నాయి. కాగా ఈ చిత్రాల్లో పాన్ ఇండియా హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం "దేవర" కూడా ఉంది.

జక్కన్న రాజమౌళితో కొట్టిన గ్లోబల్ సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడం చాలా ఆలస్యంగా మొదలైంది కానీ ఈ సినిమా కంటే ముందే మొదలైన పలు సినిమాలకంటే ముందే ఈ చిత్రం రిలీజ్ కి వస్తుంది. ఈ రేంజ్ లో దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

devara movie plot and a powerful dialogue got leaked

కానీ ఈ చిత్రం అనూహ్యంగా సమ్మర్ రేస్ నుంచి అక్టోబర్ కి అక్కడ నుంచి మళ్ళీ సెప్టెంబర్ కి ప్రీపోన్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలోని ఒక పవర్ఫుల్ డైలాగ్ అంటూ ఒక లైన్ ఇప్పుడు సోషల్ మీడియాని చుట్టేస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ పలికించే ఒక డైలాగ్ అంటూ ఒకటి వైరల్ అవుతుండగా అదేమిటంటే.. "సాదా సీదా మగాళ్లు కావాలా? ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా??" అంటూ ఎన్టీఆర్ తన మార్క్ గాభీర్యంతో చెప్పబోతున్నాడని ఇది ఇప్పుడు బయటకి వచ్చింది. దీనితో అభిమానుల్లో ఇది యిట్టె వైరల్ గా మారిపోయింది.

ఇక దీనితో పాటుగా ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా తాను రీసెంట్ గా అసలు దేవర ప్లాట్ లైన్ ఏంటో లీక్ చేసాడు. దేవర సినిమా అనేది పాత కాలంలో జరిగే కథ అని ఇదొక సముద్ర నేపథ్యంలో అక్కడ ఉండే ట్రైబల్స్ థీమ్ లో తెరకెక్కుతుంది అని తెలిపాడు. అలాగే దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి ఒక సరికొత్త స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు అని ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయని తెలిపాడు.

devara movie plot and a powerful dialogue got leaked

దీనితో అసలు దేవర సినిమా ఏ కాలంలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక క్లారిటీ వచేసినట్టే అని చెప్పాలి. కాగా ఇపుడు అనిరుద్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. అయితే ఎన్టీఆర్ పాత్ర ఆ ట్రైబల్స్ కి పెద్దగా, వారిని కాపాడే వాడిగా కనిపిస్తుంది అని కూడా ఓ టాక్ ఉంది. మొత్తానికి ఐతే కొరటాల శివ గ్రాండ్ గానే సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుంటుందో చూడాలి.

ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తుండగా తనతో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా విలన్ గా ఈ సినిమాతో ఎంటర్ అవుతున్నారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన గెటప్ శ్రీను, హిమజ లాంటి నటీనటులు తమ డబ్బింగ్ లని పూర్తి చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Read more about: jr ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X