Devara: జపాన్‌లో దేవర రిలీజ్.. ఆ సినిమానే ఎన్టీఆర్ టార్గెటా?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన దేవర చిత్రం మరోసారి కలెక్షన్ల సునామీని సృష్టించేందుకు రెడీ అవుతున్నది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం జపాన్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలకు జపాన్‌లో మంచి స్పందన లభించింది.

అయితే ఈ సినిమా పట్ల జపాన్ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో అక్కడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఆ దేశంలో పర్యటించేందుకు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన జపాన్ రిలీజ్ వివరాలు, అలాగే ఎన్టీఆర్ ప్రమోష్సన్ వివరాల్లోకి వెళితే..

Devara to Release in Japan Jr NTR to visit for Promotion

దేవర చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. ఈ చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటించిన వారు, పనిచేసిన వారి రెమ్యునరేషన్లతోపాటు ఇతర ఖర్చులు కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 400 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేశాయి.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవర భారీ వసూళ్లను సాధించింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 40 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల రూపాయలు, కేరళలో 2.5 కోట్లు, హిందీలో 82 కోట్లు, ఓవర్సీస్‌లో 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో మొత్తంగా ఈ సినిమా 450 కోట్లు వసూలు చేసింది.

అయితే ఎన్టీఆర్‌కు జపాన్‌లో ఉన్న క్రేజ్ చూసిన తర్వాత దేవర విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వర్క్స్ మొదలయ్యాయి. ఇటీవల ఎన్టీఆర్, అక్కడ చేపట్టిన ప్రమోషన్స్ నిర్వాహకులతో ఆన్‌లైన్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి వారితో చర్చించారు. ఆ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన RRR చిత్రానికి జపాన్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభించింది. ఈ చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ రికార్డుపై దేవర గురిపెట్టినట్టు తెలుస్తున్నది. జపాన్ రిలీజ్ తర్వాత ఈ సినిమా భారీ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ జపాన్‌లో పర్యటించి తన సినిమా ప్రమోషన్స్ చేస్తారని పేర్కొంటున్నారు.

More from Filmibeat

Read more about: devara japan jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X