Devara Trailer 2: భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర గురించి వినాలా’..దేవర ట్రైలర్ రిలీజ్..
Devara Trailer 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. సన్సెషల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. అటు అడ్వాన్స్ బుకింగ్ లో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో తారక్ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. తాజాగా దేవర మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. భారీ బడ్డెట్ మూవీ 'దేవర'సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ వస్తుండటంతో అంచనాలు బాగా పెరిగాయి. నిజానికి ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొదటి ట్రైలర్ లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించగా.. ఇందులో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఊర్ మాస్ లుక్‌లో యాక్షన్ అదరగొట్టేశాడు.
ఈ ట్రైలర్ లో దాదాపు మొదటి ట్రైలర్ చూపించిన విజువల్స్ నే చాలా వరకు చూపించారు. కాని, ఈ ట్రైలర్ లో కథను కాస్తా రీలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే..' నిన్న రేత్రి ఓ పిడా కళ వచ్చింది జోగులా.. సముద్రం మళ్లీ ఎరుపు అయినట్టు.. అది నా చేతులు మీదు అయినట్టు కనిపించింది.' అంటూ ఎన్టీఆర్ డైలాగ్ తో ప్రారంభమతోంది. కొన్ని యాక్షన్ చూపిస్తూ.. ' భయం పోవాలంటే దేవుడి కథ వినాలి.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర గురించి వినాలా' అని ప్రకాశ్ రాజ్ డైలాగ్ పీక్స్ అనే చెప్పాలి.

ఆ తరువాత హీరో శ్రీకాంత్.. 'సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు.. కొండమీద ఇంకో దేవరను తయారు చేస్తే.. అది మీకే మంచి కాదుభైరవ అంటూ వార్నింగ్ ఇచ్చే మాస్ డైలాగ్.. కేక పుట్టిస్తోంది. చివర్లో ఓ ముసలి క్యారెక్టర్ తో ' ముందుండేంది మంచి రోజులు కాదు దేవర.. మన అనుకునే వారు మనోళ్లు కాదు' అనే డైలాగ్ తో ఎదో గట్టి ప్లాష్ బ్యాక్ ఇది అనేలా ఉంది. ఇక లాస్ట్ డైలాగ్ ' సముద్రం ఎక్కాలా.. సముద్రం ఎలాలా..' అనే పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్ విడుదలైంది. నిజంగా ఈ ట్రైలర్ లోని ఒక్కొక్క సన్నివేశాలు, ఫైట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ ట్రైలర్ చూస్తున్న కొద్దీ మరోపారి చూడాలా అనేలా ఉంది.
దేవర చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నార. ఈ చిత్రంలో సైఫ్ అలీఖన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ మూవీని సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

దేవర ట్రైలర్ 2 తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ట్రైలర్ 2 విడుదలతో తారక్ ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. దేవర నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లకు మంచి స్పందన లభించింది. తారక్-జాన్వీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











